KGF 2 Creates Sensation : ఇప్పుడు దక్షిణాది సినిమా మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న ఎకానమీని గాని అలాగే ఇతర భాషల్లో పాగా వెయ్యడంలో గాని సత్తా చాటి దమ్ము చూపిస్తుంది. గత కొన్నాళ్ల కితం భారీ హిట్ బాహుబలి రెండు భాగాలతో దర్శక దిగ్గజుడు రాజమౌళి గేట్లు తెరవగా దాని తర్వాత అదే క్రేజ్ తో సమానంగా అన్ని భాషల్లో సెన్సేషన్ రేపిన సినిమా “కేజీఎఫ్”.
యంగ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ క్రేజీ ఫ్రాంచైజ్ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ ని నమోదు చేస్తుంది. ఇండియన్ సినిమా దగ్గర ఓ సినిమా 1000 కోట్లు మార్క్ చేరింది అంటే అందులో బాలీవుడ్ మార్కెట్ వసూళ్లు కూడా చాలా కీలక పాత్ర వహిస్తాయి.
మరి అలాంటి బాలీవుడ్ లో వాళ్ళ హిందీ సినిమాలు భారీ వసూళ్లతో దుమ్ము లేపుతాయి కానీ వాళ్ళ సినిమాలను కూడా ఎగరేసిన చిత్రాలు మన సౌత్ నుంచే ఉండడం విశేషం. ఈ లిస్ట్ లో బాహుబలి 2 చిత్రం 500 కోట్లకి పైగా వసూళ్లతో(కేవలం హిందీ మార్కెట్ లో) ఆల్ టైం రికార్డుతో ఉంది.
మరి దాని తర్వాత 380 కోట్లతో అమిర్ ఖాన్ “దంగల్” సినిమా ఉంది. ఇప్పుడు దీనిని క్రాస్ చేసి హిందీలో ఆల్ టైం 2 ప్లేస్ లో నిన్నటి వసూళ్లతో కేజీఎఫ్ 2 సినిమా 391 కోట్లతో రెండో స్థానంలోకి వచ్చేసింది. ఇలా ఒక డబ్బింగ్ సినిమా వెళ్లి వాళ్ళ మార్కెట్ లోనే సినిమాని కొట్టడం అనేది ఒక వండర్ అనే చెప్పాలి.
అలాగే ఇప్పుడు హిందీలో కేజీఎఫ్ సినిమా మరింత స్థాయిలో వసూళ్ళని రెండో వారం కన్నా అధికంగా రాబడుతుండడం ప్లస్ అయ్యింది. ఈ లెక్కన లాంగ్ రన్ లో 500 కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ సినిమా ప్రకంపనలు ఇలా ఉన్నాయి.