YSRCP: 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వైసీపీ పార్టీ ఘోర ఓటమిపాలు అయింది. ఇలా వైకాపాకు కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో ఎంతోమంది కీలక నేతలు ఈ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కొంతమంది రాజకీయ ఒత్తిడి కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండగా మరికొందరు వైకాపా నుంచి కూటమి పార్టీలలోకి వెళ్లారు.
ఇలా వరుసగా నేతలందరూ బయటకు వెళ్లగా పార్టీ బలహీన పడుతూ వచ్చింది. అయితే అనూహ్యంగా బయటకు వెళ్లిన వారందరూ ఒక్కొక్కరిగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మాజీ మంత్రి సాకే శైలజనాథ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి హయామంలో ఈయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న శైలజనాథ్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరు అవుతున్న తరుణంలో జగన్ పిలుపు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇకపోతే రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి గత ఎన్నికలలో టికెట్ ఇవ్వరని వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే సూచించారు దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కాపు రామచంద్రారెడ్డి బిజెపి పార్టీలోకి చేరారు. ఇక గత ఎన్నికలలో రాయదుర్గం నియోజకవర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు.
ఇలా మెట్టు గోవిందరెడ్డి ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలన్నింటిని పక్కన పెట్టి బెంగళూరులోనే ఉంటూ తన వ్యాపారాలను చూసుకుంటున్న నేపథ్యంలో రాయదుర్గంలో పార్టీ కేడర్లలో తీవ్ర నిరాశ ఎదురవుతుంది ఇలాంటి తరుణంలోనే అక్కడ బాధ్యతలను కాపు రామచంద్రారెడ్డి చూసుకుంటే తిరిగి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని జగన్ మాట ఇచ్చారట తద్వారా ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. అయితే జగన్ జిల్లాల పర్యటనలో భాగంగా తిరిగి కాపు రామచంద్రారెడ్డి వైసీపీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. ఇలా పార్టీ నుంచి వెళ్లిన ఒక్కొక్కరు పార్టీలోకి తిరిగి వస్తున్న నేపథ్యంలో వైసీపీకి ఊపిరి పోసినట్టు అవుతుంది.