కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎల్డీఎఫ్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి స్వప్న సురేష్ సంచలన విషయాలు వెల్లడించారు. గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసుల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలకంగా వ్యవహరించచారని, కాన్సులేట్ జనరల్‌తో ఆయన నేరుగా సంప్రదింపులు జరిపారని స్వప్నా సురేష్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎదుట స్పష్టం చేశారు.
సీఎం విజయన్, స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్‌తో పాటు ముగ్గురు కేబినెట్ మంత్రులకు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రమేయం ఉందని కస్టమ్స్ శాఖ కేరళ హైకోర్టుకు నివేదించింది. సీఎం పినరయి విజయన్‌కు అరబిక్ మాట్లాడటం, అర్ధం చేసుకోవడం రాని క్రమంలో కాన్సులేట్ జనరల్, ముఖ్యమంత్రి మధ్య సాగిన సంప్రదింపులకు స్వప్నా సురేష్ మీడియేటర్‌గా వ్యవహరించేవారని, ఈ ఒప్పందంలో ముఖ్యమంత్రి, మంత్రులు రూ కోట్లలో కమిషన్ పొందారని స్వప్నా సురేష్ స్టేట్‌మెంట్ వెల్లడించిందని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
కేరళలో వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సెన్షేషనల్ గా మారింది. ఈ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు స్వప్న సురేష్. అసలు ఎవరీ స్వప్న సురేష్. గోల్డ్ స్మగ్లింగ్ లో ఆమె పాత్ర ఏంటి? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్. ప్రస్తుతం దేశ, విదేశాల్లో స్వప్న సురేష్ పేరు మార్మోగిపోతోంది. యూఏఈ రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగి అయిన స్నప్న తన కాంటాక్టులను తెలివిగా వాడుకుంటూ గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని కేరళకు దర్జాగా స్మగ్లింగ్ చేస్తోంది. డిప్లమాటిక్ వీసాలను అడ్డం పెట్టుకుని ఆమె సాగిస్తున్న వ్యవహారం ఎట్టకేలకు బట్టబయలైంది. అయితే, ఆమె సీఎంవోలో కీలక ఉద్యోగి కూడా కావడంతో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది.