Katrina Kaif – వైరల్..కత్రీనా పెళ్ళికి ఇదేం వింత రూల్..?

బాలీవుడ్ కి చెందిన పలువురు బిగ్ స్టార్ హీరోయిన్స్ లో కత్రినా కైఫ్ కూడా ఒకరు. అలాగే కత్రినా కూడా మన తెలుగు నుంచే స్టార్ట్ అయ్యి బాలీవుడ్ లో స్టార్ గా సెటిల్ అయ్యింది. అయితే పలువురు స్టార్స్ ఎలాగో తమ కెరీర్ కి సంబంధించి కాస్త లేట్ గానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

మరి అలానే కత్రినా కూడా ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అయ్యింది. అయితే వీరి పెళ్ళికి ఒక వింత రూల్ పెట్టినట్టుగా ఓ టాక్ వైరల్ అవుతుంది. తమ పెళ్ళిలో మొబైల్స్ ని బ్యాన్ చేశారట. ఎవరు కూడా ఈ పెళ్ళిలో సెల్ఫీ లు ఫోటోలు తీసుకోకుండా ఈ బ్యాన్ చేసినట్టుగా ఇప్పుడు వైరల్ అవుతున్న సమాచారం.

అయితే ఇందులో అసలు మేటర్ లోకి వెళితే ఇదంతా జస్ట్ రూమర్ అట. గజ్ రాజ్ రావు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పుట్టించిన పుకారు ఇది అట. దీనితో కత్రినా ఈ రూల్ పెట్టిందని ఈ మాట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది తెలిసిన వారు రూమర్ ని ఎంజాయ్ చేస్తున్నారు.