అల్లు అరవింద్ ఆ హీరోను నట్టేట వదిలేశాడు

Karthikeya disappoints Allu Aravind

Karthikeya disappoints Allu Aravind

గీతా ఆర్ట్స్ కాంపౌండ్ సినిమా అంటే అన్నీ హంగులు ఆర్భాటాలు ఉంటాయి. ప్రమోషన్లు పీక్స్ లో చేస్తారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరో అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా చేస్తే ఇండస్ట్రీలో పాతుకుపోవచ్చనే అనుకుంటారు. సినిమా విడుదలయ్యాక కాస్త అటు ఇటు అయినా ప్రమోషన్లతో లాక్కొచ్చేస్తారనే నమ్మకం ఉండేది. అయితే ఈ లెక్కలు ‘చావు కబురు చల్లగా’ విషయంలో కుదరలేదు. హీరో కార్తికేయ ఎన్నో ఆశలతో చేసిన సినిమా ఇది. విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలు గట్టిగానే చేశారు.

నిర్మాత బన్నీ వాస్ స్టేజి మీద నుండే ‘జాతిరత్నాలు’ బృందానికి వార్నింగ్ ఇచ్చి హైప్ పెంచేశారు. ఇంత ధీమాగా ఉన్నారంటే సినిమాలో విషయం ఉంటుందని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ రిలీజయ్యాక తేడా కొట్టింది. చిత్రం ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. మొదటిరోజే నెగెటివ్ టాక్ వచ్చింది. అక్కడక్కడా పర్వాలేదని మాట వినబడినా దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయలేదు నిర్మాతలు. పడిపోయే సినిమాను ప్రచారంతో లేవదీయాలనే ఆలోచనను పక్కనపెట్టేశారు. ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. దీంతో ప్రేక్షకులు కూడ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు.

నిర్మాత అంటే సినిమాను అమ్మేసుకుని ఉంటారు కాబట్టి సైడ్ అయిపోయినా వారికేమీ నష్టం ఉండదు. కానీ ఎంతో నమ్మకంతో సినిమా చేసిన కార్తికేయ మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. హిట్ అనిపించుకోకపోగా డిజాస్టర్ ఫలితం మిగలడంతో నిరాశకు లోనయ్యారు. ఈ ఫ్లాప్ అతని కెరీర్ కు స్పీడ్ బ్రేకర్ అనే అనుకోవాలి.