లైవ్ లో శ్రీకాంత్ రెడ్డిని బూతులు తిట్టిన కరాటే కళ్యాణి.. ఏం పీకలేవంటూ కామెంట్స్!

నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరుగుతున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రోజురోజుకు వీరి వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి పై తాజాగా కరాటే కళ్యాణి టీవీ లైవ్ లో మాట్లాడుతూ అతనిని బండ బూతులు తిట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను వాడిని వదలను వెళ్లి వాన్ని తన్నుతా.. వాడి వల్ల నా కాళ్లు వెంట్రుక కూడా తెగదు వాడు ఏం పీకలేడు అంటూ పచ్చి బూతులు మాట్లాడింది. రేయ్ నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడిన మాటపై నిలబడు అంటూ చాలెంజ్ విసిరింది.

ఈ కేసు కోసం నేను చావడానికైనా సిద్ధమే.బాబి అనేది ఒక సినిమా క్యారెక్టర్ సినిమా క్యారెక్టర్ నువ్వు చేసే ఫ్రాంక్ వీడియోలు ఒకటేనా. ఇలా మా సినీ పరిశ్రమను అంటే ఏమాత్రం ఒప్పుకోను. సినిమా పరిశ్రమ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ లైవ్ లోనే ఈమె శ్రీకాంత్ రెడ్డి పై దారుణంగా తిట్లు పురాణం మొదలు పెట్టారు. ఇలా కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి మధ్య వివాదం ముదూరుతూ వస్తుంది. గురువారం సాయంత్రం కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన చేస్తున్న ఫ్రాంక్ వీడియోల పట్ల సమాజం చెడిపోతుందని తనపై దాడి చేసింది.

ఈ గొడవలో భాగంగా ఒకరిపై మరొకరు పెద్దఎత్తున దాడి చేసుకొని గాయాలపాలయ్యారు. ఇప్పటికే వీరిద్దరి పై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ విషయంపై స్పందించిన శ్రీకాంత్ రెడ్డి తన వీడియోలు వల్ల ఎవరూ ఇబ్బంది పడటం లేదని ఆ మహిళలు వారికి మంచి గుర్తింపు రావాలని డబ్బులు తీసుకొని మరి చేస్తున్నారు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. కరాటే కళ్యాణి కేవలం డబ్బు కోసం మాత్రమే నన్ను ఇలా బ్లాక్ మెయిల్ చేసిందని శ్రీకాంత్ రెడ్డి వీడియో ద్వారా తెలియజేశారు కదా.