ప్రశాంత్ నీల్ తెలుగులో సెటిలైపోతే.. కన్నడ ప్రేక్షకులు బాధ

Kannada People not happy with Prashanth Neel
Kannada People not happy with Prashanth Neel
కన్నడ ఇండస్ట్రీలో గొప్ప దర్శకులు చాలామందే ఉన్నారు.  అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన మేకర్స్ ఉన్నారు. అయితే బిజినెస్ పరంగా కన్నడ పరిశ్రమను పైకి లేపింది మాత్రం ప్రశాంత్ నీల్. ‘కెజిఎఫ్’ చిత్రంతో కన్నడ ఇండస్ట్రీ గురించి జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. 
 
అసలు కన్నడలో అంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం, సినిమా నేషనల్ లెవల్లో ఒక ఊపు ఊపడం, కళ్ళు చెదిరే భారీ కలెక్షన్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇదంతా ప్రశాంత్ నీల్ వద్దనే సాధ్యపడింది.  ప్రశాంత్ నీల్ క్రేజ్ చూసి కన్నడ ప్రేక్షకులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తీసే ప్రతి సినిమా ఒక అద్బుతం అవ్వాలని కోరుకున్నారు.  
 
అయితే ప్రశాంత్ నీల్ మాత్రం వారిని నిరుత్సాహానికి గురిచేస్తున్నారట.  ప్రశాంత్ నీల్ ఊహించని రీతిలో బయటి సినిమాలని ఒప్పుకుంటున్నారు.  ‘కెజిఎఫ్ 2’ తర్వాత ఆయన చేయనున్న సినిమాలన్నీ దాదాపు తెలుగులోనే ఉన్నాయి. 
 
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘సలార్’ కాకుండా ఎన్టీఆర్ హీరోగా ఒకటి, డివివి దానయ్య నిర్మాణంలో ఒకటి  చేయనున్నారు. ఇవి కంప్లీట్ అయ్యేలోపు ఇంకో రెండు సినిమాలు సెట్ అయ్యేలా ఉన్నాయి.  అంటే ఇంకో రెండు మూడేళ్లు ఆయన ఏ కన్నడ హీరోతోనూ సినిమా చేయలేరు.  ఇదే కన్నడిగులకి నచ్చట్లేదు. 
 
ముందు మన హీరోలతో చేయాలి కానీ బయటి హీరోలతో చేస్తున్నాడేంటి అంటూ మండిపడేవారు ఉన్నారు. ఇంకొందరైతే కొంపదీసి తెలుగులో సెటిలైపోతాడా ఏంటి అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ తెలుగులో బిజీ అయిపోతుండటం కన్నడ ప్రేక్షకులకు పెద్దగా నచ్చట్లేదనే చెప్పాలి.