Kalyan Dev: గత కొన్ని రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో విడాకుల గోల మొదలైంది. గత ఏడాది సమంత నాగచైతన్య ,అమీర్ ఖాన్ కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకుని అందరినీ షాక్ కి గురి చేయగా.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకొని మరోసారి అందరికీ షాక్ ఇచ్చారు.ఇలా ఇండస్ట్రీలో ప్రస్తుతం విడాకులు గురించి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.ఇకపోతే గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో మెగా డాటర్ శ్రీజ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీజ తొందరలోనే తన భర్త కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలోనే సమంత మాదిరిగానే శ్రీజ తన పేరు చివర తన భర్త పేరును తొలగించిందని, వీరు కూడా సమంత మాదిరిగానే త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఇలా తన భర్త పేరును తొలగించి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తన పేరును మాత్రమే పెట్టుకోవడంతో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇలా తన గురించి వస్తున్న ఈ వార్తలపై కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు గురించి తెలుసుకోవడం కోసం మీడియా ఎంతో ఫోకస్ చేస్తోందని అయితే వారి వ్యక్తిగత విషయాలన్నింటిని మీడియాతో పంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని కళ్యాణ్ దేవ్ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం.ఈ విధంగా సెలబ్రిటీల మనోభావాలతో ఆడుకోవడం ఏమాత్రం సరైనది కాదు అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే కళ్యాణ్ దేవ్ తన సన్నిహితుల దగ్గర ఈ విధంగా చెప్పినప్పటికీ వీరి గురించి వస్తున్న వార్తలు మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.అందుకు గల కారణం శ్రీజ తన భర్త పేరు తొలగించడమే కాకుండా ఆయన నటించిన సూపర్ మచ్చి సినిమాకి మెగా కుటుంబం ఏ మాత్రం సపోర్ట్ చేయకపోవడం అలాగే మెగా కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమాలకు కళ్యాణ్ దేవ్ దూరంగా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.