భ‌ర్త‌ని వ‌దిలి ఉండ‌లేక‌పోతున్న కాజ‌ల్‌.. షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పి ముంబై చెక్కేసిన చంద‌మామ‌

క‌లువ క‌ళ్ళ సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. త‌న చిన్ననాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న ఈ బుట్ట‌బొమ్మ పెళ్లైన కొద్ది రోజుల‌కే హ‌నీమూన్‌లో భాగంగా మాల్దీవుల‌కి చెక్కేసింది. వారానికి పైగా త‌న భ‌ర్త‌తో క‌లిసి ఆ భూత‌ల స్వ‌ర్గంలో ఎంజాయ్ చేసిన కాజ‌ల్ వాటికి సంబంధించిన ఫొటోల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజ‌న్స్ కు మాంచి థ్రిల్ క‌లిగిస్తూ వ‌చ్చింది. ఇక రీసెంట్‌గా త‌న భ‌ర్త‌తో క‌లిసి ఆచార్య సెట్‌లో అడుగుపెట్టింది. చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్న త‌ర్వాత షూటింగ్ కొన‌సాగించింది.

తాజా షెడ్యూల్‌లో చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌లపై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాడ‌ట కొర‌టాల శివ‌. దాదాపు ప‌ది రోజుల పాటు ఈ షెడ్యూల్ జ‌రిగిన‌ట్టు తెలుస్తుండ‌గా, వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న‌ మ‌రో షెడ్యూల్ లో కాజ‌ల్ అడుగుపెట్ట‌నుంది. అయితే విర‌హ‌వేద‌న చెందుతున్న కాజ‌ల్ త‌న భ‌ర‌ని క‌లిసేందుకు ముంబైకు వెళ్ళింది. కొద్ది రోజులు అత‌నితో గ‌డిపాక తిరిగి షూటింగ్‌లో పాల్గొన‌నుంది. ఈ అమ్మ‌డి చేతిలో ప్ర‌స్తుతం ఆచార్య‌తో పాటు ముంబై సాగా, ఇండియ‌న్ 2, ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్‌లు ఉన్నాయి.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు కూడా ఆసక్తి చూపినట్టు సమాచారం. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఏబీసీ ఛానల్‌తో కలిసి ‘క్వాంటికో’ అనే సీరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ప్రియాంక త‌న అందాల‌తో యువ‌త మ‌న‌సుల‌ని దోచుకుంది. ఇప్పుడు ఆ టీవీ షోను ఇండియ‌న్ వ‌ర్షెన్‌లో చేయ‌డానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌తో పాటు కాజల్.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న మరో వెబ్‌సిరీస్‌లో కూడా కాజ‌ల్‌ నటిస్తోంది.