Kajal Aggarwal: టాలీవుడ్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అంతేకాకుండా ఆ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు కూడా వినిపించాయి. ఆ విషయంపై స్పందించిన కాజల్ అగర్వాల్ భర్త న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్ గా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేశాడు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా నీ రాక కోసం ఎదురు చూస్తున్నాము అంటూ గర్భవతి మహిళ ఉన్న ఎమోజీని క్యాప్షన్ తో పాటు ఒక ఫోటోని షేర్ చేశాడు గౌతమ్.
ఆ సమయంలో కాజల్ కు అభిమానులు నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి నుంచి కాజల్ కూడా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెబుతూనే వస్తోంది. ఇది ఇలా ఉంటే పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ అగర్వాల్ అప్పుడే వర్కౌట్స్ ని కూడా మొదలు పెట్టేసింది. గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు చేసే వ్యాయామాలు చేస్తూ, గర్భం దాల్చిన మహిళలు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటోంది. అదే విషయాన్ని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇటీవలే కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ కిట్ ప్రమోషన్స్ లో కూడా ప్రెగ్నెన్సీ కి సంబంధించిన చిన్న హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇకపోతే కాజల్ సినిమాల విషయానికి వస్తే.. కాజల్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కాజల్ అగర్వాల్ ఉమ అనే ఒక బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ అదేరీతిలో సినిమాలు తీస్తూ దూసుకుపోతోంది. ఇక పెళ్ళి తర్వాత కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం పెద్ద కుండా డోస్ ని మరింత పెంచుతోంది.