ఇన్నాళ్లకు కాజల్ కు ఆ అవకాశం దొరికింది

Kajal Aggarwal got golden chance from Nagarjuna

Kajal Aggarwal got golden chance from Nagarjuna

2007లో ‘చందమామ’తో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ దశాబ్దంకు పైగా స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతోంది. ఈ 13 ఏళ్ళల్లో దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోలతోనూ నటించేసింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మొదలుకుని మీడియం రేంజ్ హీరోల వరకు అందరినీ కవర్ చేసేసింది. పలు ఇండస్ట్రీ హిట్లలో ఆమె భాగస్వామ్యం కూడ ఉంది. సీనియర్ హీరోల్లో చిరుతో మాత్రమే నటించిన ఆమెకు ఇతర పెద్ద హీరోలతో చేయాలనే కోరిక కూడ ఉండేది. కానీ ఆమెకు ఆ అవకాశం రాలేదు.

ఇన్నాళ్లకు ఆమెకు అవకాశం దొరికింది. అది కూడ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జునతో కావడం విశేషం. నాగ్ ప్రజెంట్ ‘వైల్డ్ డాగ్’ సినిమాను పూర్తిచేసి ఇటీవలే ప్రవీణ్ సత్తారు సినిమాను అనౌన్స్ చేశారు. ఇది కూడ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో నాగ్ సరసన ఎవర్ని కథానాయకిగా తీసుకోవాలనే ప్రశ్న రాగానే పలువురి పేర్లను పరిశీలించారు. కానీ అందరు పెద్ద హీరోయిన్లు నాగార్జునతో చేసేసి ఉండటం వల్ల ఫ్రెష్ పెయిర్ కోసం వెతికిన వారికి చివరకు కాజల్ అగర్వాల్ మంచి ఛాయిస్ అనిపించింది.

పైగా ఇప్పటివరకు ఆమె నాగార్జునతో చేసింది లేదు. అందుకే ఆమెను అప్రోచ్ అయ్యారు నిర్మాతలు. అవకాశం వచ్చిన వెంటనే కాజల్ సైతం ఓకే చెప్పేసింది. దీంతో ప్రజెంట్ ఆమె చేతిలో చిరు సినిమాతో నాగ్ సినిమా కూడ చేరింది.