Surprise element in Acharya : ఆచార్య’లో కాజల్ అగర్వాల్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ అవుతుందా.?

Surprise element in Acharya

Surprise element in Acharya : మొదట్లో త్రిషని అనుకున్నారుగానీ, చివరికి కాజల్ అగర్వాల్ సీన్‌లోకి వచ్చింది. ఆమెతో కొన్ని సన్నివేశాలు కూడా ‘ఆచార్య’ కోసం తెరకెక్కించారు. కానీ, ఆ సన్నివేశాలకు కత్తెర వేశామని సాక్షాత్తూ దర్శకుడు కొరటాల శివ చెబుతుండడం గమనార్హం. దాంతో కాజల్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. సినిమాలో గ్లామర్ లేకపోతే ఎలా.?

పూజా హెగ్దే రూపంలో ‘ఆచార్య’ సినిమాకి గ్లామర్ వున్నాగానీ, ఆమె పాత్ర నిడివి కూడా తక్కువేనన్న ప్రచారం జరుగుతోంది. సో, కాజల్ అగర్వాల్‌కి సంబంధించి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా ‘ఆచార్య’లో వుండి వుండాలి. అదేంటన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.

సినిమా నిడివి కూడా ఎక్కువే వున్నట్లు సెన్సార్ అప్‌డేట్ ద్వారా తేలింది. సో, రిలీజ్ వెర్షన్‌కి సంబంధించి, నిడివి విషయంలో జాగ్రత్త పడి, కాజల్ ఎపిసోడ్స్ మీద ‘కత్తెర వేటు’ వేసినా, ఆ తర్వాత పరిస్థితిని బట్టి, ఆ సన్నివేశాల్ని అదనంగా జోడించే అవకాశాలైతే లేకపోలేదు.

పైగా, కాజల్ ఈ సినిమాలోని ఓ పాటలో వుంది. ఆ పాటకు సంబంధించి గతంలోనే ప్రోమో వదిలారు. సో, పాట నుంచి ఆమెను కట్ చేయడం కుదరదు. పాటలో వున్నాక, సినిమాలోనూ కనిపించి తీరాలి కదా.? ఏమో, కొరటాల ఏం మ్యాజిక్ చేశాడో.. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ వ్యూహమేంటో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాలి.