AP: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మీడియా సమావేశంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన సంచలనంగా మారుతూ ఉంటాయి కానీ ఆయన వ్యాఖ్యలను చాలామంది తీసి పారేస్తారు కానీ కేఏ పాల్ మాత్రం సరైన పాయింట్ ఆధారంగానే మాట్లాడుతూ ఉంటారు అది కూటమి ప్రభుత్వమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అయినా ఆయన ప్రశ్నించే విధానం ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది.
ఇకపోతే తాజాగా జనసేన పార్టీ నుంచి నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పట్ల స్పందించారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి కే ఏ పాల్ స్పందిస్తూ.. జనసేన పార్టీ అనేది ఒక అవినీతి పార్టీ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాలలో మాట్లాడుతూ జనసేన పార్టీని ప్రజల కోసమే స్థాపించారని తెలిపారు..
ప్రజల కోసమే తాను పార్టీ పెట్టి న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు. అయితే ఇప్పుడు పార్టీ కోసం కష్టపడిన లక్షల మంది కార్యకర్తలు ఉన్నా, పవన్ వారికి ఏమీ ఇవ్వడు. 21 మంది ఎమ్మెల్యేల తరఫున ఒక ఎమ్మెల్సీ సీటు ఉంది. దానిని కార్యకర్తలకు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా తన సొంత అన్నయ్యకే ఇచ్చారు అంటూ విమర్శించారు.
పవన్ కల్యాణ్‌తో సంబంధం ఉన్న కుటుంబ రాజకీయాలపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది కేవలం అవినీతిపరమైన కుటుంబ రాజకీయాల పార్టీయే. ఇప్పుడు నాగబాబును, ఒక హైదరాబాదులో ఉన్న యాక్టర్‌ను తెచ్చి, మనల్ని అందరినీ వంచనలో పడేస్తున్నాడని విమర్శించారు ఈ తరుణంలోని జనసైనికులకు కూడా ఈయన ఓ సలహా అందించారు. జనసైనికులారా, మీరు మారకపోతే, సమయం వచ్చింది. బయటకి రా, ప్రజాశాంతి పార్టీలో చేరి, ఈ కుటుంబ, కుల, అవినీతి రాజకీయాలకు గుడ్ బై చెబుదాం అంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి పాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.