‘వెళ్ళవయ్యా వెళ్ళూ..’ అంటూ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో.. అందునా యువ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించేసుకున్న సదా, ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించడంలేదు. అప్పట్లో సదా అంటే ఓ సంచలనం.
ఆ సదా గురించి తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మనసులో కోరిక బయటపెట్టేశాడు. ‘సదా.. నీ మీద కన్నేశాను. కానీ, మనం కలిసి పని చేయడం సెట్ అవలేదు..’ అంటూ దర్శకేంద్రుడు వ్యాఖ్యానించడంతో అంతా అవాక్కయ్యారు.
మామూలుగా అయితే దర్శకేంద్రుడు మాట్లాడేది చాలా చాలా తక్కువ. ఈ మధ్యనే ఆయన తరచూ మీడియా ముందుకొస్తున్నారు. దాంతో ఆయన ఏం మాట్లాడినా అదో సంచలనమే అవుతుంది. దర్శకేంద్రుడు తలచుకుంటే, సదాని మళ్ళీ హీరోయిన్‌గా నిలబెట్టేయగలడు. అదీ ఆయన సత్తా.
అడపా దడపా టీవీ షోలలో మాత్రమే సదా కనిపిస్తోంది. ఓటీటీ వేదికల నుంచీ సదాకి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట.
ఇదిలా వుంటే, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఏదో అనుకోకుండా సదా మీద అలాంటి కామెంట్లు చేసెయ్యలేదనీ, తన తదుపరి సినిమా కోసం సదా పేరుని దాదాపు ఖాయం చేశాడనీ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ‘పెళ్ళి సందడి’ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.