చిరంజీవి మొహం మీద నో చెప్పిన చోట కే నాయుడు

చిరంజీవి అంటేనే మాస్ లో ఒక రేంజ్ క్రేజ్. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతకన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు చిరంజీవి. ఇప్పటికి కూడా చిరంజీవి ని మించిన స్టార్ హీరో తెలుగు సినిమాలో రాలేదు. డాన్స్, ఫైట్స్ తో పాటు చిరంజీవి కి స్క్రిప్ట్ సెలక్షన్, కెమెరాపై చాలా నాలెడ్జ్ ఉండేది.

ఆ టైం లో ప్రముఖ కెమెరామెన్ చోట కే నాయుడు కి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. కెమెరా గురించి తనకున్న అనుమానాలన్నీ కూడా చోటాను అడిగి తెలుసుకునేవాడట చిరు. ఏ యాంగిల్ పెడుతున్నారు.. ఏ లెన్స్ పెడుతున్నారనే ప్రతీ విషయాన్ని అడిగి తెలుసుకునే వాడట.

చోట కే నాయుడు ప్రతిభ తెలిసిన చిరు .. ఓ సారి ఇంటికి పిలిచాడట. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ అవుతుంది.. దానికి నువ్వే కెమెరామెన్ అని చోటాతో చిరు అన్నాడట. అంత పెద్ద స్టార్ హీరో అడిగినా సరే…నేను చేయను అంటూ మొహం మీదే చెప్పేశాడట చోటా. ఎందుకురా అని చిరంజీవి అడిగితే.. చేస్తే మీకు చేస్తాను గానీ మీ తమ్ముడికి చేయను.. ముందు మీతోనే పని చేస్తాను అని అనేశాడట.

అయితే అప్పటికి చిరంజీవి నెంబర్ వన్ హీరో…మరో వైపు చోట కే నాయుడు అప్పుడపుడే కెమెరామెన్‌గా అడుగులు వేస్తున్నాడు. అలాంటి వాడికి  అవకాశం అంటే మామూలు విషయం కాదని చిరంజీవి అన్నాడట. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ చిరంజీవి కాంబినేషన్‌లో రావాల్సిన సినిమాకు చోటాను కెమెరామెన్‌గా ఫిక్స్ చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి ‘చూడాలని వుంది’, ‘బావగారూ బాగున్నారా’ సినిమాల్లో చోటా కే నాయుడు కి అవకాశం ఇచ్చారు చిరంజీవి.