“NTR 31” ఫస్ట్ లుక్ తో అప్పుడే టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన ఎన్టీఆర్.!

NTR 31 First Look

NTR 31 First Look : టాలీవుడ్ టాప్ హీరోలలో టైగర్ ఎన్టీఆర్ కి ఉండే మాస్ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తనకుండా మాస్ స్టార్డం చాలా దృఢం. అందుకే దానితో ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో మాసివ్ రికార్డులు ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం కొన్ని అసాధ్యమైన రికార్డులను అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నే పరిచయం చేసి అదరగొట్టారు.

ఇక ఇప్పుడు కూడా అలాగే మన తెలుగు సినిమా దగ్గర ఇది వరకు టచ్ అవ్వని రికార్డుని అందుకొని సంచలనం నమోదు చేశారు. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుంచి ఒక బిగ్స్ అప్డేట్స్ బయటకి వచ్చాయి. వాటిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఎన్టీఆర్ 31వ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యగా దానికి ట్విట్టర్ లో కనీ వినీ ఎరుగని రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ ఫస్ట్ పోస్టర్ పోస్ట్ కి ఏకంగా ఒక లక్ష 50 వేలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే అసలు ఈ మార్క్ మన తెలుగు సినిమాలో ఒక సినిమాకి మొట్ట మొదటి సారి అని చెప్పాలి. అలాంటిది ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఈ నెవర్ బిఫోర్ రికార్డును అందుకొని మరోసారి హిస్టరీ క్రియేట్ చేసింది. మొత్తానికి అయితే ఈ సినిమాతో ఫస్ట్ నుంచే భారీ స్థాయి రికార్డులు స్టార్ట్ అయ్యాయి ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆ హవా ఎలా ఉంటుందో చూడాలి.