Anil Kapoor- jhanvi Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనిల్ కపూర్ ఒకరు. ఈయన స్వయాన బోనీకపూర్ సోదరుడు అన్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఇండస్ట్రీలో అనిల్ కపూర్ శ్రీదేవి జంటగా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి జోడి సూపర్ హిట్ పెయిర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించిన శ్రీదేవి అనిల్ కపూర్ గురించి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ ఎన్నో విషయాలను బయటపెట్టారు.
ఇండస్ట్రీలో శ్రీదేవికి ఎంతో ఇష్టమైన సహనటుడు హీరో ఎవరు అనే విషయానికి వస్తే టక్కున అనిల్ కపూర్ పేరు చెప్పవచ్చు. అమ్మకు బాబాయ్ అంటే ఎంతో ఇష్టమని ఎప్పుడూ కూడా తన సినిమాలను చూడమని సలహా ఇచ్చేదని తెలిపారు. అనిల్ కపూర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ శ్రీదేవి తనకామిక్ టైమింగ్ గురించి ప్రస్తావింవించేదని ఈ సందర్భంగా జాన్వి కపూర్ తన బాబాయ్ గురించి తన తల్లి చెప్పిన మాటలను బయట పెట్టారు.
ముఖ్యంగా అనిల్ కపూర్ నటించిన నో ఎంట్రీ సినిమాపై శ్రీదేవి ఎన్నో ప్రశంసలు కురిపించారని ఈ సందర్భంగా శ్రీదేవి తనయ జాన్వి కపూర్ తన తల్లి తన బాబాయ్ పై చూపించే ప్రేమ గౌరవాన్ని బయటపెట్టారు. ఇలా ఇద్దరు స్టార్ హీరో హీరోయిన్ స్క్రీన్ పై ఎంతో అద్భుతంగా నటించి బాలీవుడ్ హిట్ పెయిర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇక శ్రీదేవి మరణాంతరం జాన్వీ కపూర్ తన బిగ్గెస్ట్ గైడెను కోల్పోయానని తనకు సినిమాల గురించి ప్రతిదీ తన తల్లి ఎంతో అద్భుతంగా వివరించెదని వెల్లడించారు. జాన్వి తన తల్లి మరణానంతరం తన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో బిజీగా ఉన్నారు.