చిరంజీవిపై జీవిత అప్పుడలా, ఇప్పుడిలా.. ఎందుకలా.?

రాజకీయాల్లో నిన్న వేరు, నేడు వేరు. నిన్నటి మాట నేడు ఇంకోలా మారిపోతుంటుంది. నేటి మాట, రేపు ఇంకోలా మారిపోతుంది. రాజకీయాల్లో మాట మార్చకుండా నిలబడటం చాలా చాలా కష్టం. కానీ, వ్యక్తిగత జీవితాల్లోకి సైతం తొంగి చూసి, దిగజారుడు రాజకీయ విమర్శలు చేయడం క్షమార్హం కానే కాదు. అసలు విషయంలోకి వస్తే, సినీ నటి జీవిత.. ఇప్పుడు చిరంజీవిని అందరివాడుగా అభివర్ణిస్తున్నారు. ‘మా’ ఎన్నికల కోసం జీవితకు, మెగాస్టార్ చిరంజీవి అవసరమొచ్చింది. నిజానికి, గతంలోనే ఆమె తన టోన్ మార్చుకున్నారు.. చిరంజీవిని ప్రసన్నం చేసుకునేందుకు తన భర్త రాజశేఖర్‌తో కలిసి రకరకాల పబ్లిసిటీ స్టంట్లు చేశారు. కానీ, కొన్నేళ్ళ క్రితం చిరంజీవిపైనా, చిరంజీవి కుటుంబంపైనా, చిరంజీవి నడుపుతోన్న బ్లడ్ బ్యాంక్‌పైనా జీవిత చేసిన విమర్శలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ.. మెగాభిమానులే కాదు, సినీ పరిశ్రమలోనివారూ, సాధారణ ప్రజానీకం మర్చిపోలేరు.

సినీ నటుడు పృధ్వీ, మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన, జీవిత మీద కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్శలపై జీవిత చాలా ఆవేదన చెందుతూ ఈ రోజు కంటతడిపెట్టినంత పని చేశారు మీడియా ముందు. మరి, చిరంజీవిపై జీవిత గతంలో చేసిన విమర్శలకు చిరంజీవి ఎంతలా బాధపడి వుండాలి. పైగా, చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ మీద ఆరోపణలు చేయడం. ‘మా’ ఎన్నికల్లో రాజకీయాలు వుండకూడదు.. అని అంటున్నారు జీవిత. రాజకీయాల్లో మాత్రం, దిగజారుడుతనం ఎందుకు.? చిరంజీవి రాజకీయ సిద్ధాంతాల్ని జీవిత ప్రశ్నించొచ్చు. ఎవరైనా నిలదీయొచ్చు. చిరంజీవి అభిమానులే తమ మీద దాడి చేశారంటూ జీవిత, రాజశేఖర్ అప్పట్లో చేసిన యాగీ అంతా ఇంతా కాదు. చిరంజీవి అలా దాడులు చేయించే వ్యక్తా.? చిరంజీవి అభిమానులు అలా దాడి చేస్తారా.? ఆ విషయం జీవితకీ తెలుసు. కానీ, అప్పట్లో ఆమె చేసిన పొలిటికల్ యాక్టింగ్ అలాంటిది మరి.