మెగా ఫ్యామిలీతో గొడవ పై స్పందించిన జీవిత.. మా మధ్య దూరానికి అదే కారణం?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా కొనసాగుతున్నటువంటి రాజశేఖర్ కుటుంబానికి, మెగా కుటుంబానికి మధ్య ఏ మాత్రం సఖ్యత లేదని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే మెగా కుటుంబానికి జీవిత-రాజశేఖర్ కుటుంబానికి ఎన్నో మనస్పర్థలు ఉన్నాయని ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు షికార్లు చేశాయి. ఈ విధంగా మెగా కుటుంబంతో గొడవల గురించి తాజాగా జీవిత స్పందించి అసలు విషయం వెల్లడించారు.

రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన శేఖర్ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వీరికి మెగా కుటుంబంతో గొడవల గురించి ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ మాకు మెగా కుటుంబానికి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియా కారణంగా మా రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని, వారి చానల్స్ వ్యూస్ కోసం వారు పెట్టేథంబ్ నెయిల్స్ వల్ల మా రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని జీవిత వెల్లడించారు.

యూట్యూబ్ థంబ్ నెయిల్స్ తో ఏదో జరిగిపోతోందనే భ్రమ కలిగిస్తున్నారని, పరోక్షంగా ఈ థంబ్ నెయిల్స్ కారణమని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. ఇక శేఖర్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా మలయాళ హిట్‌ మూవీ జోసెఫ్‌ కు ఇది రీమేక్ అని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ తో పాటు ఆయన కూతురు శివాని కీలక పాత్రలో నటించారని తెలిపారు. ఇక సినిమాకి స్వయంగా జీవిత దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ శేఖర్ అనే వ్యక్తి ఉంటాడని ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా జీవిత తెలియజేశారు. ఈ సినిమా ఈ నెల 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.