ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు అందుకున్న సీనియర్ నటి జయప్రద!

స్వర్గీయ నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం శతజయంతి చలనచిత్ర ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రముఖ మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్ వి ఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంతోపాటు పలువురి ప్రముఖులకు ఎన్టీఆర్ అవార్డులను ఇచ్చి సత్కరించడం జరిగింది.

ఎన్టీఆర్ శతజయంతి చలనచిత్ర ఉత్సవాల్లో భాగంగా అలనాటి స్టార్ హీరోయిన్ జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ జయసుధ మాట్లాడుతూ ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకున్నా గాని.. అందరి హృదయాల్లో ఆయన బతికే ఉన్నారు. అటువంటి ఆయన పేరుతో చలనచిత్ర పురస్కారం తీసుకోవటం నా జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయమని జయప్రద తన ఆనందాన్ని సభాముఖంగా ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర వేడుకల్లో ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ప్రముఖ నటి జయప్రద తో పాటు పలువురికి ఎన్టీఆర్ అవార్డులతో సన్మానించారు.ఈ క్రమంలో డాక్టర్ మైధిలి అబ్బరాజుకి ఎన్టీఆర్ అభిమాన అవార్డుని అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో నట చక్రవర్తి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఘన నివాళులు అర్పించారు.