జయమ్మ పాత్ర సుమక్కకు కొట్టిన పిండేగా.!

సీనియర్ యాంకర్‌గా బుల్లితెరపై కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న సుమ, వెండితెరపైనా సత్తా చాటారు గతంలో. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై సరికొత్త అవతారంలో మెరవబోతున్నారు. సుమక్క ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమా రూపొందుతోంది.

లేటెస్టుగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఓ ఊరు, ఆ ఊరికి పెద్దగా సీరియస్ లుక్స్‌లో జయమ్మగా సుమ కనకాల కనిపిస్తోంది. గతంలోనే సుమ వెండితెర రీ ఎంట్రీ విషయమై ఓ పెద్ద రచ్చ జరిగింది స్పెషల్ పబ్లిసిటీ రూపంలో.

అదంతా ఉత్తదే అనుకున్నారు. కానీ, ఇదిగో ఇప్పుడిలా జయమ్మగా దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చింది సుమ. ఇకపోతే, ఈ సినిమాకి విజయ్ కుమార్ కాలివరపు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, బుల్లితెరపై తన వ్యాఖ్యానంలో భాగంగా ఎన్నో రకాల గెటప్పుల్లో సుమ కనిపించి అభిమానుల మెప్పు పొందింది. ఇక పెద్ద తెరపై జేజమ్మను తలపించేలా ఉన్న ఈ జయమ్మ పాత్ర ఆమెకు కొట్టిన పిండే అని చెప్పక తప్పదు.