వైరల్ : పవన్ పై సెల్ఫ్ ట్రోల్ చేసుకుంటున్న జనసేన.?

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అలాగే ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెలుగు స్టేట్స్ లో ఓ రేంజ్ లో వినిపిస్తూ వస్తుంది. అయితే ఏపీలో రాజకీయ పరిణాలుతో పవన్ ఒక్కసారిగా భారీ హైప్ చెయ్యగా పవన్ అయితే అధికార పార్టీపై యుద్ధం ప్రకటించానని చెప్పాడు.

మరి గత కొన్నాళ్ల నుంచి కూడా తన సోషల్ మీడియా బాగా యాక్టీవ్ గా కూడా ఉండగా తన అధికారిక జనసేన పార్టీ హ్యాండిల్ నుంచి అయితే కొన్ని సర్కాస్టిక్ పోస్ట్ లు కార్టూన్స్ తో పడుతూ ఉంటాయి. అయితే పొలిటికల్ గా విమర్శలు కామన్ కానీ పవన్ పై లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ మాత్రం తనకే సెల్ఫ్ ట్రోల్ లా ఉందని అనిపిస్తుంది.

పవన్ ని మొదటిసారిగా కార్టూన్ లా పెట్టి ఆంధ్రా థానోస్ తో పోరాడటానికి వచ్చాను అని ఒత్తి చేతుల్తో అంటూ తమకి తామే పోస్ట్ చేసుకోవడం కాస్త అతిగా ఉంది. దీనితో అయితే కాస్త ఓవర్ గా ఉందా అని పవన్ ఫ్యాన్స్ కె అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అయితే పవన్ భారీ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సినిమా చేస్తుండగా ఇది వచ్చే ఏడాదిలో రిలీజ్ కి సిద్ధం అవుతుంది.