Parvathi Melton : ‘జల్సా’ హీరోయిన్ పార్వతి మిల్టన్ ఏం చేస్తోందో తెలుసా.?

Parvathi Melton : ‘జల్సా’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ పార్వతి మిల్టన్ గుర్తుంది కదా. అంతకు ముందే ‘వెన్నెల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మంచు విష్ణుతో ‘గేమ్’, తదితర సినిమాల్లో నటించింది.

బార్బీ డాళ్‌లా కనిపించే పార్వతి మిల్టన్ అందానికి తెలుగులో దక్కాల్సిన పాపులారిటీ దక్కలేదనే చెప్పాలేమో. హీరోయిన్, సెకండ్ హీరోయిన్, ఆఖరికి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఓ స్పెషల్ సాంగ్‌లో కూడా నటించేసింది. ఆ తర్వాత సడెన్‌గా మాయమైపోయింది అందాల భామ పార్వతి మిల్టన్.

కట్ చేస్తే, షాంషూ లలాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని చక్కగా విదేశాల్లో సెటిలైపోయింది. ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. పార్వతి మిల్టన్‌కి చదువు అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే హయ్యర్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీలు అందుకుంది.

అలాగే, ట్రావెలింగ్ అంటే కూడా ఈ ముద్దుగుమ్మకి చాలా చాలా ఇష్టమట. కాస్త టైమ్ దొరికితే చాలు, ఫ్యామిలీతో కలిసి  ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చేస్తుందట. అండర్ వాటర్ డైవింగ్ చేయడమంటే, పార్వతి మిల్టన్‌కి చాలా సరదా అని చెబుతోంది. అప్పుడప్పుడూ తన యాక్టివిటీస్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది పార్వతి మిల్టన్.

తన గురించి అంత చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫ్యూచర్‌లో సినిమాల్లో నటించే ఆసక్తి వుందా.? అని అడిగితే, నో వే.. అని కుండ బద్దలుకొట్టేసింది. ఫ్యామిలీ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాననీ, అవకాశమొచ్చినా ఇకపై సినిమాల్లోకి వచ్చే వుద్దేశ్యం తనకు లేదని తేల్చి చెప్పేసింది బార్బీడాల్  పార్వతి మిల్టన్.