Jagapathi Babu: అలాంటి డైరెక్టర్ కోసం ప్రాణాలు ఇవ్వవచ్చు : జగపతి బాబు

Jagapathi Babu: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన జగపతి బాబు ఆ తర్వాత కాలంలో ఎక్కువగా విలన్ పాత్రలో నటిస్తూ వచ్చాడు. ఇక ఆ ప్రస్తుతం విలన్ పాత్రలకే పరిమితం అయిపోయాడు. ఇక ఒకానొక సమయంలో ఎక్కువగా ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఇక అప్పట్లో జగపతిబాబు సినిమా రిలీజ్ అవుతుంది అంటే అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కట్టేవాళ్లు అంటే అర్థం చేసుకోవచ్చు. జగపతి బాబు హీరో గానే కాకుండా విలన్ గా కూడా నటించి తను అంటే ఏంటో నిరూపించుకున్నాడు. మొదట లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన జగపతి బాబు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరించాడు.

అయితే జగపతిబాబు మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఇస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే తాజాగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బోయపాటి శ్రీను ఇదివరకు చాలా ఎక్కువగా బూతులు మాట్లాడేవారు.. ఇప్పుడు మానేశారు.. బూతులు మాట్లాడటం మానేసి పూర్తిగా బంగారమై పోయాడు అని చెప్పుకొచ్చాడు జగపతి బాబు. అయితే ఆయన అలా అలవాటు మార్చుకోవడం తనకు హ్యాపీగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే.. రాజమౌళి సినిమాలో పాత్రలు డిజైన్ చేసే విధానం.. విలన్ ను పవర్ ఫుల్ గా చూపించే విధానం బాగుంటాయి అని తెలిపారు. అయితే ఒకసారి జగపతి బాబును రాజమౌళి కలిసినప్పుడు విలన్ గా జగపతి బాబు నూతన సినిమాల్లో పెట్టుకోలేక పోతున్నందుకు అసంతృప్తిని వ్యక్తం చేయగా.. విలన్ గా నన్ను పెట్టుకోవాలని రూలేం లేదు కదా అని జగపతిబాబు అన్నారట.

కొరటాల శివ కీ ఫెయిల్యూర్ అన్నది లేదు. ఎందుకంటే అతను ఆలోచించే విధానం చాలా బాగుంటుంది. ఇక పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం.. అతని ఆలోచనలకు నాకు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద సీన్లు అయినా చాలా సింపుల్ గా చేస్తుంటారు అని చెప్పుకొచ్చారు జగపతిబాబు. ఇప్పటికీ కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేస్తాడు.. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే మరీ చేస్తాడు.. 99% దర్శకులు అలా చేయరు.. కానీ పూరి జగన్నాథ్ మాత్రం అలా కాదు.. సినిమా చేసినా చేయకపోయినా మనిషి బంగారమే అని చెప్పుకొచ్చారు. అనంతరం సుకుమార్ గురించి మాట్లాడుతూ సుకుమార్ ఒక అల్టిమేట్ డైరెక్టర్. ఇలాంటి డైరెక్షన్ కి ప్రాణాలు చేయమంటే ఆర్టిస్టులను చేయవచ్చు. ఆయన ఏది అడిగినా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది.. ఆ విషయం మీకు ఖచ్చితంగా తెలిసి పోతుంది అంటూ జగపతిబాబు సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు..