RC 16: RC 16 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన జగపతిబాబు… కష్టాలు మామూలుగా లేవుగా?

RC 16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం ఆర్ సీ 16 (వర్కింగ్ టైటిల్). ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక పండుగను పురస్కరించుకొని ఈ సినిమాకు చిన్న విరామం ఇచ్చారు అయితే సంక్రాంతి పండుగ కూడా పూర్తి కావడంతో తిరిగి ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు జగపతిబాబు కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా తర్వాత మరోసారి జగపతిబాబు రామ్ చరణ్ ఈ సినిమాలో సందడి చేయబోతున్నారు.

ఇలా ఈ సినిమా షూటింగ్లో భాగంగా జగపతిబాబు కూడా పాల్గొన్నారు తాజాగా ఈ సినిమాలో ఆయన మేకప్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో జగపతిబాబు చాలా విభిన్నంగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఆయన మేకప్ వేసుకుంటూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేస్తూ.. చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్ సీ 16 కోసం మంచి పని పెట్టాడు. గెటప్ చూసిన తరువాత నాకు చాలా తృప్తిగా అనిపించింది అంటూ ఈ వీడియోని షేర్ చేశారు.

ఇక ఈ సినిమాలో జగపతిబాబు చాలా విభిన్నమైన పాత్రలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమా కోసం జగపతిబాబు చాలా కష్టపడుతున్నారని స్పష్టమవుతుంది. ఆర్ సీ 16 కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.