Jagapathi Babu: రామ్ గోపాల్ వర్మ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతి బాబు.?

Jagapathi Babu: తెలుగు సినీ ప్రేక్షకులకు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు సుపరిచితమే. జగపతి బాబు తన సినీ జీవితంలో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు కుటుంబ కథ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నాడు. జగపతి బాబు ఎక్కువగా కుటుంబ కథా నేపథ్యం తో వచ్చే సినిమాల్లో నటిస్తారు. హీరోగా నిలదొక్కుకున్న తరువాత కొంతకాలం విరామం తీసుకొని ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి వరుసగా సినిమాలో విలన్ పాత్రలో నటిస్తూ వస్తున్నాడు.

అలా క్రమంగా వెండితెరపైన విలనిజం పండించడంలో ఎక్స్‌పర్ట్ అయిపోయాడు జగపతిబాబు. లెజెండ్ సినిమాతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం వివిధ భాషల్లోని సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు. అలా సెకండ్ ఇన్నింగ్స్‌లో జగపతిబాబు దూసుకుపోతున్నాడు. ఇకపోతే జగపతిబాబు ఇప్పటివరకు తన కెరీర్‌లో చాలా మంది డైరెక్టర్స్‌తో వర్క్ చేశాడు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో తను వర్క్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ఊహించని కామెంట్ చేశాడు జగపతి బాబు. రామ్ గోపాల్ వర్మ, జగపతిబాబు కాంబినేషన్ లో వచ్చిన గాయం సినిమా షూటింగ్ సమయంలో తనకు, ఆర్జీవీకి మధ్య జరిగిన డిస్కషన్, గొడవ గురించి తెలిపాడు జగపతిబాబు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక తిక్కలోడని, తాను కూడా అలాంటి వాడినేనని అన్నాడు జగపతిబాబు.

గాయం సినిమా షూటింగ్ టైంలో తాను వర్మ వద్దకు వెళ్లి ఊర్మిళకు, తనకు మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కావడం లేదని చెప్పానని అన్నాడు. దాంతో వర్మ ఊర్మిళతో తనకు హీరోయిన్ అంటే ఇష్టం లేదని చెప్పేశాడు. అలా తనకు, ఊర్మిళకు మధ్య గొడవ పెట్టేశాడు వర్మ అని తెలిపాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఊర్మిళ తన వద్దకు వచ్చి ఎందుకు నచ్చలేదో చెప్పాలని అడిగిందని గుర్తుచేసుకున్నాడు జగపతిబాబు. ఈ క్రమంలోనే తాను వర్మ వద్దకు వెళ్లి నీకు శ్రీదేవి అంటే ఇష్టం కానీ, నాకు శ్రీదేవి అంటే ఇష్టం లేదని చెప్పగా అప్పుడు.. వర్మ గుడ్.. అందుకే నువ్వు నాకు ఇష్టం అని అన్నాడని జగపతి బాబు చెప్పుకొచ్చాడు.