బాబాయ్ హత్య కేసు కోసమే అమిత్ షాతో జగన్ భేటీ.. ? హాట్ హాట్ కామెంట్స్

jagan and viveka

 2019 ఎన్నికల సమయంలో నేటి సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయానా బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే, అయితే ఇప్పటికి దానికి భాద్యులు ఎవరనేది మాత్రం తెలియలేదు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య శనివారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ వివేకా హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

varla ramaiah

 ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి అమిత్ షాను కలిసి, వై.ఎస్. వివేకాహత్య కేసు విచారణలో సీబీఐకు మోకాలడ్డారని ప్రజలంతా అనుకుంటున్నారు. తనబాబాయి హత్యకేసులో తనకుచెందిన ముఖ్యమైన వ్యక్తిని, కాపాడుకోవడాని కే జగన్, అమిత్ షాతో భేటీ అయ్యారని రాష్ట్రమంతా అనుకుంటోంది. సొంత బాబాయి హత్య కేసునే నీరుగార్చాలని చూసిన ముఖ్యమంత్రి, దళితమహిళ నాగమ్మ హత్యాచారం కేసులో అసలు దోషులను శిక్షిస్తారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై ప్రజల్లో అనుమానాలు తలెత్తినందున, గౌరవ హైకోర్టు వివేకాహత్యకేసు విచారణ వివరాలను ప్రజలకు వెల్లడించాలని చేతులెత్తి న్యాయస్థానాన్ని వేడుకుంటున్నాను.

 సొంతబాబాయి హత్యకేసుని నీరుగారుస్తున్న ముఖ్యమంత్రి, దళితమహిళ నాగమ్మ హత్యాచారం ఘటనలో అసలు దోషులను శిక్షిస్తాడా? 15, 16ఏళ్ల బాలురు, కాయకష్టం చేసుకుంటూ జీవించే బలవంతురాలైన నాగమ్మను అత్యాచారంచేసి, దారుణంగా హతమార్చారంటే ఎవరైనా నమ్ముతారా? దళిత మహిళహత్యాచార ఘటనలో ప్రభుత్వ తీరుని, పోలీసుల వ్యవహరశైలిని నిరసిస్తూ, టీడీపీ మహిళా విభాగం ఛలో పులివెందులకు పిలుపునిస్తే, ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంది?అసలు దోషులను శిక్షించడంకోసం పోలీసులు ఇద్దరు మైనర్ బాలురను అరెస్ట్ చేశారు.నాగమ్మ మృతదేహాన్ని చూడకుండా, ఆమె కుటుంబాన్ని పరామర్శించకుండా నిర్లక్ష్యంగా వ్యవరహరించిన ముఖ్యమంత్రి చేయరాని తప్పుచేశారు. జగన్ చేసిన తప్పిదం ఆయన్ని జీవితాంతం వెంటాడుతుంది.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నది నియంత్రత్వ ప్రభుత్వం కాదని, భారతప్రజాస్వా మ్యం ప్రకారం ఏప్రభుత్వమైనా రాజ్యాంగాన్ని అనుసరించే ముందుకెళ్లాలనే చిన్నవిషయాన్ని ఆయనెందుకు విస్మరిస్తున్నాడో తెలియడం లేదని రామయ్య అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం ఆర్టికల్-19 ద్వారా పౌరులకు భావప్రకటన స్వేఛ్చను, నిరసన తెలియచేసే హక్కుని కల్పించిందని, ఆర్టికల్ – 19 ను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గజగజ వణుకుతోందన్నారు. ప్రజలు నిరసన తెలియ చేస్తుంటే, వైసీపీ ప్రభుత్వం వారిని ఎందుకు నిర్భంధిస్తోందో చెప్పాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చేసిన హౌస్ అరెస్ట్ లు లెక్కేస్తే, గత 25ఏళ్లలో ఏపీలోని పోలీస్ శాఖ ఏనాడూ చేయనన్ని హౌస్ అరెస్ట్ లు చేచేసిందని వర్ల రామయ్య  ఘాటుగా వ్యాఖ్యానించాడు..