BRS: తెలంగాణ బిఆర్ఎస్ పార్టీలో అలజడి నెలకొన్న సంగతి తెలిసిందే. పార్టీ ఎమ్మెల్సీ కవిత పార్టీ గురించి చేస్తున్నటువంటి ఆరోపణలు తెలంగాణ రాజకీయాలలో చర్చలకు కారణం అయ్యాయి. ఇక ఇటీవల కవిత మీడియా సమావేశంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నడిపే సత్తా పార్టీలో ఎవరికీ లేదని అక్కడ కేసీఆర్ ఒక్కరే నాయకుడని పార్టీ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇకపోతే బిఆర్ఎస్ పార్టీని బిజెపి పార్టీలో విలీనం చేయాలని చర్చలు కూడా జరిగాయని తానే అడ్డుకున్నానని తెలిపారు.
ఈ విధంగా కవిత బిఆర్ఎస్ పార్టీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమార రేపుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు కేటీఆర్ కెసిఆర్ ఎక్కడ స్పందించకపోయిన, బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బిఆర్ఎస్ పార్టీకి పొత్తులు అచ్చి రావని, 2014లో, 2018లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచామన్నారు. బీజేపీ లో విలీనం కాదు కదా కనీసం పొత్తు కూడా ఉండదని జగదీష్‌రెడ్డి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారని, వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇక కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో చంద్రబాబునాయుడు హైదరాబాద్ ను తానే డెవలప్ చేశాను అంటూ మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా జగదీష్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు నాయుడు చెప్పే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు.పదే పదే హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేసానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబువి చెత్త మాటలు కొట్టి వేద్దాం అనుకుంటే, 100 సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారని తెలిపారు. ఇలా బిఆర్ఎస్ పార్టీ బిజెపిలో విలీనం కాబోతుంది అనే వ్యాఖ్యలను జగదీశ్ రెడ్డి పూర్తిగా ఖండించారు.