‘జాతిరత్నాలు’ నిజంగా బాగుందా లేకపోతే మోసమా ?

Jaathiratnalu is really a hit film or not

Jaathiratnalu is really a hit film or not

లాక్ డౌన్ అనంతరం విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘జాతిరత్నాలు’ కూడ ఒకటి. 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం అనూహ్య రీతిలో బ్లాక్ బస్టర్ హిట్టైంది. భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం మూడున్నర కోట్లతో నిర్మితమైన ఈ సినిమా ఇప్పటివరకు 50 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టుకుని ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తోంది. మొదటి వారం రోజులు ఎక్కడా నెగెటివ్ టాక్ అనేదే లేకుండా నడిచిన ఈ సినిమా ఇప్పుడు మాత్రం నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటోంది.

మొదటి వారం రోజులు భీభత్సమైన టాక్ రావడంతో ఇంట్రెస్ట్ లేకపోయినా తెచ్చుకుని మరీ అంత హిట్టయ్యే కంటెంట్ అందులో ఏముందో చూడాలని చాలామంది థియేటర్లకు వెళ్లారు. వారిలో చాలామంది అందరూ చెబుతున్నంత ఏం లేదు అక్కడ అంటున్నారు. కామెడీ కొంతవరకు పర్వాలేదు కానీ మరీ అంత గొప్ప సినిమా ఏమీ కాదని అంటున్నారు. మాస్ ఆడియన్స్ కొందరైతే అసలేం ఉంది అందులో అంటూ పెదవి విరుస్తున్నారు. మొదట్లో రివ్యూలు కూడ అంత గొప్పగా ఏం రాలేదు. మరోవైపు చిత్ర మాత్రం ప్రమోషన్లు అదరగొట్టేస్తున్నారు. ఊరూరూ తిరిగి ధూమ్ ధామ్ చేస్తున్నారు. హిట్ హిట్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. కొందరు ప్రేక్షకులైతే ఇలా హిట్టు హిట్టు అనే ఒపీనియన్ ప్రేక్షకుల మెదళ్లలోకి ఇంజెక్ట్ చేసేస్తున్నారని అంటున్నారు. మరి మోటులో వచ్చిన హిట్ టాక్ ఇప్పుడొస్తున్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రెండూ చూస్తే సినిమాను ఏమని డిసైడ్ చేయాలో అర్థం కావట్లేదు.