సింగర్ నోయల్, హీరోయిన్ ఏస్తర్ గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి అయిన కొద్ది రోజుల మనస్పర్ధలు వచ్చాయట. వెంటనే మ్యూచువల్ డైవర్స్ అప్లై చేశారట. అయితే కోర్టు అధికారికంగా ప్రకటించే వరకు ఈ విషయాన్ని బయటకు చెప్ప కూడదని ఇద్దరూ నిర్ణయించుకున్నారట. నిన్న కోర్టు ఆర్డర్స్ రావడంతో అఫీషియల్‌గా విడాకులు మంజూరయ్యాయట. అందుకే ఈ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకున్నట్టు మంజూరు చేశారు. ఈ మేరకు ఈస్తర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
‘మేం విడిపోయిన విషయాన్ని ప్రకటించడానికి దాదాపు ఏడాదికి పైగా ఎదురుచూస్తున్నాను. అయితే ఇది చట్టబద్ధంగా, అధికారికంగా నిర్ణయించిన తరువాతే చెబుదామని ఊరుకున్నాను. నోయెల్, నేను 2019 జనవరి 3 వ తేదీన వివాహం చేసుకున్నాము. మాకు పెళ్లైన కొద్ది రోజుల్లోకే మనస్పర్దలు వచ్చాయి. మేము వెంటనే గత ఏడాది జూన్‌లో మ్యూచువల్ డైవర్స్ కోసం దాఖలు చేశాము. కోర్టు నుంచి సరైన సమాచారం, విడాకులు మంజూరు చేసిన తరువాతే బయటకు చెప్పాలని ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నాము. నేను ఎదైనా సరే ముక్కు సూటిగా చెబుతాను, నిజాయితీగా ఉంటాను. ఏది చెప్పినా అలాగే చెబుతాను. నోయల్, నా జీవితంతో ముడిపడి ఉన్న వారందరికీ ఈ విషయం తెలియాలని ఇప్పుడు చెప్పాను.
ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నసున్నితమైన అంశాలను దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అంతేకాకుండా నా ఈ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, ఎప్పటిలానే మీరు నా వెంటే ఉంటూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మనమందరం మనుషులం … మన జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి … ప్రతీ ఒక్కరికి ఇలాంటి స్థితి ఏర్పడవచ్చు.. బంధాలు విఫలం కావచ్చు.. అలాంటి సమయంలో ఎంతో ఒత్తిడి, అది ఎంత క్లిష్టంగా మాకు తెలుసు …అటువంటి సమయాల్లో మీ నెగెటివ్ కామెంట్స్, ప్రశ్నలు లాంటివి మరింత బాధను కలిగిస్తాయి.
కాబట్టి ఈ విషయంపై ఇక మాట్లాడదల్చుకోలేది. ఈ మేరకు ఇది నా ఏకైక, చివరి ప్రకటన. దయచేసి వీటి గురించి మళ్లీ నన్ను ఎక్కడా అడగకండి.. నన్ను అర్థం చేసుకున్నందుకు, నాకు మద్దతు తెలిపినందుకు, చూపించిన ప్రేమ, మద్దతు, దయ, ప్రేయర్స్, ఆశీర్వాదాలు నాకు ఎప్పటికీ అలాగే కావాలి.. ఉండాలి. మీరు నాపై ప్రేమను కురిపించండ’ని ఏస్తర్ కోరుకుంది.