కేసీఆర్ రాజీనామా మాట వెనుక నిగూడార్థం ఇదేనా…?

kcr telugu rajyam

 కేసీఆర్ లాంటి బలమైన నేత నోటినుండి రాజీనామా అనే పదం వినాల్సి వస్తుందని ఎవరు కూడా ఊహించి ఉండరు, కానీ మొన్నటి ఒక సమావేశంలో కేసీఆర్ నోటి వెంట రాజీనామా అనే పదం రావటం పట్ల రాజకీయ విశ్లేషకులు , మరి కొంత మంది రాజకీయ నేతలు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేయాలనీ కేసీఆర్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాడని, అందుకోసమే అన్ని సిద్ధం చేసుకున్నాడని, గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ ను సీఎం చేయటానికి రంగం సిద్ధం చేశాడని అది దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ నోటి నుండి రాజీనామా అనే పదం వచ్చినట్లు చెపుతున్నారు.

vijayashanti

 తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి దీనిపై మాట్లాడుతూ. దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు డిపాజిట్లు రాకుండా చేయాల‌ని ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు కంటి మీద నిద్ర లేకుండా శ్ర‌మిస్తున్నా ర‌న్నారు. కానీ ఎన్నిక త‌ర్వాత హ‌రీశ్‌కు ఆయ‌న మామ‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ షాక్ ఇవ్వ‌బోతున్నార‌ని చెప్పి సంచ‌ల‌నం రేకెత్తించారు.దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు రాగానే, కేటీఆర్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు కేసీఆర్ ప‌క్కా ప్ర‌ణాళిక త‌యారు చేసుకున్న‌ట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోందని విజ‌య‌శాంతి చెప్పుకొచ్చారు.

 ఈ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చేలా కేసీఆర్ మాట‌లు తోడ‌య్యాయ‌న్నారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా మొట్ట‌మొద‌టి సారిగా కేసీఆర్ నోట రాజీనామా మాట వ‌చ్చింద‌ని విజ‌య‌శాంతి గుర్తు చేశారు. గతంలో త‌న ప్ర‌భుత్వంపై విప‌క్ష నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తే జైలుకు పంపుతాన‌ని బెదిరించిన కేసీఆర్ … ఇప్పుడు సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కొత్త వాదాన్ని తెర‌మీద‌కు ఎందుకు తెచ్చార‌ని” విజయశాంతి ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే కేసీఆర్ ముందుగానే తాను రాజీనామా చేయబోతున్నాడు అనే విషయాన్నీ ఎదో ఒక విధంగా జనాల్లోకి తీసుకోని వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఈ మాట మాట్లాడినట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో రాజకీయ వారసత్వ మార్పిడి ఖాయమని చెప్పుకోవాలి.