ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ టాలీవుడ్ హీరోస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. ఇండియన్ సినిమా దగ్గర మెగాస్టార్ చిరంజీవి లెగసి ని మోస్తూ ఎక్కడా మచ్చ తీసుకురాకుండా చరణ్ అదిరే లైనప్ తో ఫ్యాన్స్ ని కూడా భారీగా సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు రాజమౌళి తర్వాత శంకర్ తో నటించిన ఏకైక ఇండియన్ హీరోగా తాను రికార్డు సృష్టించగా నెక్స్ట్ ఇప్పుడు శంకర్ సినిమాపైనే ఓ కొత్త బజ్ సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. అయితే ఇది ఒకింత కాస్త బ్యాడ్ న్యూస్ లానే ఉందని చెప్పాలి.
ఇక అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రం షూటింగ్ ఇంకా 100 రోజులకి పైగా కంప్లీట్ కావాల్సి ఉందట. ఇక దీని తర్వాత ఇంకా సినిమాలో ప్యాచ్ వర్క్ లు ముఖ్యంగా శంకర్ మార్క్ గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాలో ఉండగా వాటికి కూడా సమయం తీసుకునే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో లేటెస్ట్ గా మొదలైన న్యూస్.
అంటే ఈ లెక్కన వచ్చే ఏడాది ఈ చిత్రం ఉగాది కానుకగా వచ్చే ఛాన్స్ లేదనే అంటున్నారు. పైగా 2023 సగం ఏడాది గడిచాకే రిలీజ్ ఉండొచ్చని కూడా అంటున్నారు. దీనితో అయితే చరణ్ ఫ్యాన్స్ కి మరింత కాలం ఎదురు చూపులు తప్పేలా లేవని చెప్పాలి.