Big Boss 6 Telugu: బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ప్రేక్షకాదరణ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి అన్ని భాషలలో యమ క్రేజ్ ఉంది.ఈ క్రమంలోనే ప్రతి భాషలో సీజన్లను పూర్తిచేసుకుని ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లను పూర్తి చేసుకుని 6 వ సీజన్ కి సిద్ధమవుతోంది. అయితే ఒక సీజన్ పూర్తి అయ్యి, మరొక సీజన్ ప్రారంభమవడానికి సుమారు తొమ్మిది నెలల కాలం పడుతుంది.కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ పూర్తి అయిన రెండు నెలలకే మరొక సీజన్ ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ కార్యక్రమం ఇంత త్వరగా ప్రసారం కావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమాన్ని మరింత ఆలస్యం చేస్తే మరోసారి కరోనా విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ సీజన్ ని ముందుగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అదేవిధంగా మరి కాస్త ఆలస్యమైతే ఐపీఎల్ మ్యాచ్ కూడా ప్రారంభం కావడంతో ఈ కార్యక్రమ రేటింగ్స్ పై పూర్తి ఐపీఎల్ ప్రభావం పడే అవకాశం ఉండడంతో ఈ కార్యక్రమాన్ని ముందుగానే నిర్వహిస్తున్నట్లు బిగ్ బాస్ నిర్వాహకులు వెల్లడించారు.
అయితే ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ ల ఎంపిక కోసం కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారమైన ఇంటిలోనే కొన్ని మార్పులను చేసి అదే హౌస్ లో 6 వ సీజన్ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.ఇది వరకు కేవలం ఒక గంట మాత్రమే ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఈ సీజన్లో ఎలాంటి ఎడిటింగ్ లేకుండా 24 గంటలు ప్రసారం అవుతుందని నిర్వాహకులు తెలియజేశారు.ఇకపోతే గత సీజన్లో మాదిరిగానే ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.