Pawan Veeramallu : ఇన్సైడ్ టాక్ : పవన్ భారీ సినిమా గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదా?

Pawan Veeramallu : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు”. విలక్షణతకు కేరాఫ్ అడ్రెస్ అయ్యినటువంటి దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ని స్టార్ట్ చేసుకొని భారీ సెట్టింగ్ లలో కంప్లీట్ అవుతుంది.
మరి ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లోనే పలు ఊహాగానాలు, గాసిప్పులు స్టార్ట్ అయ్యాయి. అయితే వీటిలో ఆల్రెడీ ఓ బాలీవుడ్ స్టార్ బ్యూటీ కన్ఫర్మ్ కాగా ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ ఊహాగానాలు గట్టిగా వినిపిస్తూ వచ్చాయి.
వాటితో అయితే ఈ సినిమా ని ఈ అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ తో మాత్రం ఇది నిజం కాదని అంటున్నారు. ఇది జస్ట్ రూమర్ మాత్రమే అని ఇంకా చిత్ర బృందం అయితే రిలీజ్ డేట్ పై ఒక తుది నిర్ణయానికి రాలేదు అని వినిపిస్తుంది.
దీనితో పవన్ భారీ సినిమా గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదని అర్ధం అవుతుంది. ఇంకా ఈ సినిమాలో పవన్ సరసన హాట్ అండ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఎం రత్నం దాదాపు 150 కోట్లకి పైగా బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు.