ఖుషి టైటిల్ వెనుక సమంత హస్తం ఉందా.. ఇందులో నిజమెంత..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక కలిసి నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా విడుదల అయి అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో క్రేజ్ ను అందుకున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. అలాగే ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా దగ్గరగా చేసిన సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల అయి కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఈ సినిమాలో నడుము సిన్ గురించి మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇకపోతే సేమ్ అదే టైటిల్ తో రాబోతున్న సినిమాలో విజయ్ దేవరకొండ సమంత కలిసి నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఖుషి సినిమా టైటిల్ ను విజయ్ దేవరకొండ సినిమాకు పెట్టడం ఒక వర్గం ప్రేక్షకులకు అసలు నచ్చడం లేదు. అంతేకాకుండా చాలా మంది ఆ టైటిల్ ను ఎందుకు వృధా చేస్తున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ దర్శకుడు శివ నిర్వాణ మాత్రం ఆ టైటిల్ని అనుకోవడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది అని అంటున్నారు. నిన్ను కోరి,మజిలీ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమాకు ఖుషి టైటిల్ ను పెట్టడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఆ కారణం వెనుక హీరోయిన్ సమంత కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్ సమంత క్యారెక్టర్ పేరు ఖుషి అని తెలుస్తోంది. సమంత పాత్ర చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుందట. సినిమాకు ఖుషి టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని దర్శకుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ కూడా దర్శకుడు నిర్ణయానికి ఏమాత్రం అడ్డు చెప్పలేదట. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వస్తున్న ఈ కొత్త సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.