తెలుగు మీడియా రంగంలో టీవీ 9 ప్రస్థానం ఒక సంచలనం, న్యూస్ అంటేనే టీవీ 9 అనేలా ఒక బ్రాండ్ ని సృష్టించటంలో ఆ ఛానల్ బాగానే సక్సెస్ అయ్యింది. కానీ ఎప్పుడైతే టీవీ9 నుండి రవి ప్రకాష్ బయటకు వెళ్లిపోయాడో, అప్పటి నుండి టీవీ9 ప్రభ తగ్గుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటి నివేదికల్లో టీవీ9 నెలకు ఐదారు కోట్లు లాస్ లో నడుస్తుందనే మాటలు వినిపించాయి. గత రెండేళ్ల నుండి 100 కోట్లు లాస్ లో టీవీ9 ని నడిపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు కొత్త మేనేజ్మెంట్ నిర్ణయాలే కారణమని తెలుస్తుంది.
తమకి అనుకూలంగా లేరని ఛానల్ లోని కొందరిని బలవంతంగా బయటకు పంపించటంతో ఛానల్ లో నాణ్యత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీవీ9 లో మరో మెయిన్ పిల్లర్ అయినా రజనీకాంత్ ను కూడా బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. రవి ప్రకాష్, రజనీ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఇద్దరు కూడా కలిసి బాగానే పనిచేసారు. అయితే రవి ప్రకాష్ వెళ్ళిపోయినా కానీ రజిని మాత్రం ఛానల్ లోనే పనిచేస్తున్నాడు. కొత్త మేనేజ్మెంట్ కి తగ్గట్లు మారిపోతూ టీవీ9 లో కొనసాగుతున్నాడు
కానీ ఏమి అయ్యిందో ఏమో కానీ మెల్ల మెల్లగా రజినీకి పక్కకు పంపే ప్రక్రియ మొదలైందని కొందరు చెపుతున్న మాట, అదే ఛానల్ లో పనిచేసే మురళి కృష్ణని ఎక్కువగా తెరమీదకు తీసుకొనివచ్చి ఆ తర్వాత రజినీని బయటకు పంపవచ్చు అని తెలుస్తుంది. కానీ దీనిపై టీవీ9 యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా స్పదించలేదు. మరోపక్క టీవీ9 లో మెజారిటీ షేర్ లు తాను కొనుక్కోవడానికి అనుమతి ఇవ్వాలని రవి ప్రకాష్ కోర్టు మెట్లు ఎక్కాడు. తాను కూడా టీవీ9 లో షేర్ హోల్డర్ అని, ప్రస్తుతం ఛానల్ నష్టాల్లో ఉందని, తనకి అవకాశం ఇవ్వాలని రవి ప్రకాష్ కోరటం విశేషం.