Pooja Hegde : స్టార్‌డమ్ వున్నా, ఫ్లాప్‌లు వచ్చాయంటే చాలు, వెంటనే రెమ్యునరేషన్ చర్చ తెరపైకొచ్చేస్తుంటుంది సెలబ్రిటీల విషయంలో. ఈ మధ్య ఈ చర్చ బాగా ఎక్కువైపోయింది. హీరో అయినా హీరోయిన్ అయినా, ఫ్లాపులు చవి చూస్తూ రెమ్యునరేషన్ విషయంలో దిగి రావల్సిందే తప్పడం లేదు.. అలా అయిపోయింది పరిస్థితి.
ఇక ఇప్పుడు ఎవరి రెమ్యునరేషన్ చర్చకొచ్చిందటా.? అనుకుంటున్నారా.? బుట్టబొమ్మ పూజా హెగ్దే. ఓటమి అంటే తెలియదు ఇంతవరకూ పూజా హెగ్దేకి. ఆ మాటకొస్తే, ఓటమితో విలవిల్లాడే హీరోలకు సైతం తన లక్కుతో సక్సెస్ కిక్కు ఏంటో చూపించింది బుట్టబొమ్మ పూజా హెగ్దే.
అలాంటిది, పాపం ఈ సారి పూజా హెగ్దేనే ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. టైమ్ బ్యాడ్ అంతే. ఈ మధ్య భారీ అంచనాల నడుమ తెరకెక్కి, విడుదలైన ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’ సినిమాలు ఫ్లాప్ లిస్టులో పడిన సంగతి తెలిసిందే.
హీరోయిన్‌గా పూజా హెగ్దే ఈ రెండు సినిమాల్లోనూ చాలా చాలా అందంగా కనిపించింది. తనవంతు పర్‌ఫామెన్స్‌లోనూ ఎక్కడా లోటు చేయలేదు. కానీ, ఏం చేస్తాం.. ఒక్కోసారి సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఎవ్వరి చేతిలోనూ వుండవంతే.
అలా ఈ రెండు సినిమాలూ పూజా హెగ్దే కెరీర్‌లో డిజప్పాయింట్ చేశాయి. ఇదీ సంగతి. బ్యాక్ టు బ్యాక్ రెండు ఫెయిల్యూర్ మూవీస్ పడేసరికి ఇంకేముంది.. పూజా హెగ్దే తన రెమ్యునరేషన్ తగ్గించేసుకుందంటూ వేడివేడిగా వార్తలు వడ్డన మొదలైపోయింది.
నిజంగానే పూజా హెగ్దే రెమ్యునరేషన్ తగ్గించుకుందా.? ప్రస్తుతం పూజా చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రాజెక్టుతో పాటు, పవన్ కళ్యాణ్ సినిమా కూడా వుంది. అలాగే హిందీలోనూ కొన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయ్. ఆ లెక్కల్లో పూజా క్రేజ్‌కి వచ్చిన ఢోకా ఏమీ లేదనే చెప్పాలి.