Pawan Kalyan And Chiranjeevi : ఇండస్ట్రీ టాక్ : మెగాస్టార్ కోసం పవన్ కళ్యాణ్ రాబోతున్నాడా.?

Pawan Kalyan And Chiranjeevi :  ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న భారీ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అవైటెడ్ సినిమా “ఆచార్య” కూడా ఒకటని తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ తీసిన ఈ సినిమా ఒక భారీ మల్టీ స్టారర్ గా వస్తుంది.
మెగా వారసుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్ర చేసిన ఈ సినిమా నుంచి చిత్ర బృందం నిన్ననే ఈ సినిమా ట్రైలర్ పై క్రేజీ అప్డేట్ అందివ్వగా..
ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఆసక్తికర ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏఈ ఏప్రిల్ 24న అత్యంత ఘనంగా చెయ్యాలని ఫిక్స్ చెయ్యగా ఇప్పుడు ఈ వేడుకకి వచ్చే ప్రత్యేక అతిధి పై మంచి బజ్ నెలకొంది.
మరి ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ ప్రకారం అయితే ఈ సినిమాకి గాను మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది కానీ ఇండస్ట్రీ వర్గాల్లో అయితే ఈ టాక్ మంచి వైరల్ గా మారింది.
ఒకవేళ ఇదే నిజం అయితే ఈ సినిమా పై అంచనాలు వేరే లెవెల్ లోకి వెళ్ళినట్టే అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో హీరోయిన్స్ గా  అగర్వాల్ మరియు పూజా హెగ్డేలు నటించగా మణిశర్మ సంగీతం అందించిన సంగతి అందరికీ తెలిసిందే.