విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన మృతి చెందిన కుటుంబ సభ్యులకు వైకాపా ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని టీవీలో చూసి..అధికారులను వివరాలు అడిగి తెలసుకుని ఉన్న పణంగా కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆ వెంటనే హుటా హుటిన ఘటనా స్థిలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడ నుంచి నేరుగా బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. రాష్ర్టంలో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి ఇలాంటి విపత్తులపై ఇంత సానుకూలంగా స్పందించింది లేదు. దీంతో బాధితులు సహా సామాన్య ప్రజానీకానికి జగన్ పాలనలో రాష్ర్టం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం మరింత బలపడింది.
ఏపీ బీజీపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం బాధితుల విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై హర్షం వ్యక్తం చేసారు. కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ను తాము స్వాగతిస్తున్నామని కన్నాఓ మీడియా సమావేశంలో తెలిపారు. భారతీయ జనతా పార్టీ తరుపును ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని..ఘటన దురదృష్ట కరమని, అందుకు యాజమాన్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా మరో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజ్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
కోటి రూపాయలు ప్రకటించడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఇప్పటిరకూ ఎంతో మంది సీఎంలు చూసాను కానీ, అక్కడిక్కడే ప్యాకేజీ ప్రకటించడం ఎవ్వరూ చేయలేదన్నారు. ఇది రాజకీయం కాదని, మాట్లాడటానికి కానీ, విమర్శలు చేయడానికి కానీ వీలు లేకుండా జగన్ వ్యవరించారన్నారు. బాధిత కుటంబాలతో పాటు, వారి తర్వాత జనరేషన్ కూడా ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా చేసారని అభినందించారు.