ఎట్టిపరిస్థితుల్లో 2024 లో జనసేనతో కలిసి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కసిగా ముందుకెళ్తోంది. ఎన్నికలు వచ్చే లోపు ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ స్థానాన్ని కైవసం చేసుకుని వైసీపీకి బలమైన పార్టీగా నిలబడాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చేస్తున్నారు గనుక కాపు ఓటు బ్యాంక్ ఎలాగు ఉంటుంది అన్న ధీమా ఇప్పటికే బీజేపీ నేతల్లో బలపడింది. ఓస్టార్ గా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ కూడా బాగానే కలిసొస్తుందని బీజేపీ చాలా బలంగా విశ్వశిస్తుంది. గత ఎన్నికల్లో జనసేనకు ఆరుశాతం ఓట్లు పడ్డాయి.
ఈసారి ఎలాగూ ఆ సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బలం పుజుకుంటే తిరుగులేదు. ఈలోపు టీడీపీ పై వ్యతిరేకత తీసుకొస్తే సక్సెస్ అవుతాం? అనే ధీమా కలమనాధుల్లో బలంగా ఉంది. అయితే టీడీపీని నిర్వర్యం చేయడం ఎలా అన్న నేపథ్యంలో కమల నాధులు ఒడిశా ఫార్ములాతో ముందుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నట్లు లీకులందుతున్నాయి. ఒడిశా లో కాంగ్రెస్ ను నిర్విర్యం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇదే ఫార్ములాను ఏపీలో ఉపయోగించాలను కుంటున్నారుట. ఈ నేపత్యంలో పార్టీలో బీసీలకు, కమ్మ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారుట.
ఇప్పటికే తెలుగు దేశం కు అనుకూలంగా ఉన్న కమ్మ నేతల నోళ్లను కమలనాధులు నొక్కేసారు. బీసీ, కమ్మ లకు పదవులు కట్టబెడతామంటే? ఎందుకు తమవైపు ఆకర్షితులు కారు? అన్న ధీమాతో కమలనాధులు ముందుకెళ్లాలని భావిస్తున్నారుట. అయితే ఎన్నికల సమయానికి కమ్మ సామాజిక వర్గం బీజేపీ వెంట ఉంటుందా? అన్నది తేల్చడం కష్టమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గద్దెనెక్కించడంలో ఆ సామాజిక వర్గమే కీలక భూమిక పోషించింది. ప్రస్తుతానికి అవసరం మేర బీజేపీలో కమ్మ నేతలున్నా! సమీకరణాలు మారే సరికి సొంత గూటికి చేరుకోరా? అన్న సందేహం రాక మానదు. అది కులంపై ఉన్న ప్రేమ కావొచ్చు. మరొకటి కావొచ్చు. మరి ఒడిశా వ్యూహం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.