Bheemla Nayak : భయపడ్డ “భీమ్లా నాయక్”? అసలు భయం ఏంటో చూపించిన నిర్మాత.!

Bheemla Nayak : టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ మరియు ఉక్కు లాంటి హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న భారీ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. యంగ్ దర్శకుడు సాగర్ కే చంద్ర సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం పర్యవేక్షణలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలకి రెడీగా ఉంది.

అయితే ఇతర భారీ సినిమాలు ఉన్నాయి అని వాయిదా పడుతుంది అని రకరకాల ఊహాగానాలు వచ్చినా నిర్మాత నాగవంశీ ఎప్పటికపుడు క్లారిటీ అప్డేట్ ఇస్తూ వచ్చాడు. అయితే ఈరోజు మళ్ళీ భీమ్లా నాయక్ వాయిదా అని ఇతర సినిమాల వల్ల భీమ్లా భయపడ్డాడు అనే రేంజ్ లో రూమర్స్ వినిపించాయి.

కానీ వాటన్నిటికీ అసలు భయం అంటే ఏంటో చెప్పేలా మళ్ళీ నిర్మాత మైండ్ బ్లోయింగ్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడే మాస్ సాంగ్ లాలా భీమ్లా రష్ చూడ్డం జరిగింది అని మార్క్ చేసుకోండి జనవరి 12న మీరు బ్లాస్ట్ చూడబోతున్నారని సిసలైన క్లారిటీ ఇచ్చారు. సో భీమ్లా నాయక్ రూమర్స్ పై ఓ పక్కా క్లారిటీ వచ్చినట్టేగా.. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం ఇస్తుండగా నిత్య మీనన్ సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.