iphone price drop: ఐఫోన్ 12 ధర భారీగా తగ్గింది. అవును.. నిజమే, ఐఫోన్ 12 సిరీస్ అన్ని వేరియంట్ల ధరలు భారీగా తగ్గడంతో క్యాష్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. మెయిన్ గా 64GB వేరియంట్ పై దాదాపు రూ.11,901 తగ్గింది. అయితే, కేవలం ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్టులో మాత్రమే ఉంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.65,900 ఉండగా… ప్రస్తుతం రూ.53,999 ధర వద్ద లభిస్తోంది.
పైగా బ్యాంక్ ఆఫర్లతో ఐఫోన్ 12ను ఇంకొంత తక్కువ ధరకే తీసుకోవచ్చు. అయితే, ఆపిల్ కంపెనీ ఎందుకు ఐ ఫోన్ రేటు తగ్గిస్తోంది ? అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆపిల్ కంపెనీ ప్రస్తుతం ఫుల్ లాభాలలో ఉంది. పైగా వరల్డ్‌లోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అయిన ఆపిల్ అంటే పెద్ద బ్రాండ్. ఒక్క ఆపిల్ సీఈవో టీమ్ కుక్ గత ఏడాది సంపాదనే భారీగా ఉంటుంది.
ఆపిల్ సీఈవో 2021లో బేసిక్ పే, స్టాక్‌తో కలిపి $98.7 మిలియన్లు ఆర్జించాడు. భారత కరెన్సీలో రూ. 733కోట్లు. 2020లో $14మిలియన్లు ఆర్జించాడు. మన కరెన్సీలో రూ. 104 కోట్లు. ఒక్క ఏడాదిలోనే ఏడురెట్లు పెరిగింది అతని ఆదాయం. ఇక సీఈవో ఆదాయమే అంత ఉంటే.. ఇక ఆపిల్ కంపెనీ ఆదాయం ఎంత ఉంటుందో ? అందుకే, ఐఫోన్ 12 ధరను తగ్గించి ఉంటారు.