బిగ్ బాస్ తో గంగవ్వ రేంజా మజాకా.. గంగవ్వ రేంజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి విద్యార్హత లేకపోయినా గంగవ్వ తన ప్రతిభతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బాగా పాపులర్ అయింది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారుతున్నారు. గంగవ్వ కూడా ఇలా సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి సెలబ్రిటీగా గుర్తింపు పొందింది. ఎంతో ప్రతిభ కలిగిన గంగవ్వని గుర్తించిన కొందరు యువకులు మై విలేజ్ షో పేరుతో కొన్ని వీడియోస్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే ఈ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గంగవ్వ పేరు వినిపించింది.

ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ కి బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గంగవ్వ మరింత ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ షో లో గంగవ్వ తన ప్రత్యేకత చాటుకున్నారు. ఎటువంటి ఆధునిక ఆచారాలు పరిచయం లేని గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో చాలా కాలం ఉండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే మధ్యలో కొన్ని అనారోగ్యం కారణాల చేత బిగ్ బాస్ హౌస్ లో ఉండటం గంగవ్వకి కష్టతరంగా మారింది. అందువల్ల ఆమె విజ్ఞప్తి మేరకు ఈ సీజన్ మధ్యలోనే నాగార్జున ఆమెని బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపేశారు. అయితే ఆ సమయంలో నాగర్జున గంగవ్వకి కొత్త ఇంటి నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. నాగార్జున గంగవ్వకి ఇచ్చిన హామీ నెరవేర్చారు. గంగవ్వ ఏడాది క్రితం నూతన గృహప్రవేశం చేశారు.

ఇలా యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో గంగవ్వకి సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కొన్ని సినిమాలలో గంగవ్వ ప్రధాన పాత్రలలో ఇలా గంగవ్వ నటిగా కూడా తన ప్రతిభని నిరూపించుకుంది. అయితే ఇటీవల గంగవ్వకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం గంగవ్వ కొన్ని సినిమాలలో ఈ క్రమంలో షూటింగ్ సమయంలో ఆమెకు క్యారవాన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంగవ్వ స్వయంగా తెలియజేస్తూ క్యారవాన్ లో తన అనుభవాల గురించి కూడా ఆమె వెల్లడించారు. సాధారణంగా స్టార్ సెలబ్రెటీలకు కాకుండా ఒక మోస్తారు నటీనటులకు కూడా క్యారవాన్ నిర్మాతలు క్యారవాన్ సౌకర్యం కల్పించరు. అలాంటిది నిర్మాతలు గంగవ్వకు క్యారవాన్ ఇవ్వడం ప్రత్యేకంగా మారింది.