Intinti Gruhalakshmi Serial : ఒకప్పటి హీరోయిన్ కస్తూరి గుర్తుందా.? ఈ మధ్యన వెబ్ సిరీస్‌లలోనూ, టీవీ సీరియళ్ళలోనూ కనిపిస్తోన్న కస్తూరి ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్. ‘అన్నమయ్య’ తదితర సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ‘సోగ్గాడి పెళ్ళాం’, వంటి సినిమాల్లోనూ నటించింది.
అయితే, నటించిన సినిమాల కంటే కూడా ఓ పొటో సెషన్‌తో కస్తూరి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఎందుకంతలా ఆ ఫొటో సెషన్ గురించి అంతలా మాట్లాడుకున్నారంటే, అందులో ఆమె న్యూడ్‌గా కనిపించింది గనుక. కస్తూరి పెళ్ళి చేసుకుని, గర్భం దాల్చాక.. న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. అదీ అసలు కథ.
ఈ ఫొటో సెషన్ వెనుక ఇంకో పెద్ద కథ వుంది. అదేంటంటే, న్యూ బోర్న్.. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాల ఆవశ్యకత గురించీ, పిల్లలు తమంతట తాము ఆహారం తీసుకునేవరకు తల్లి పాలు ఎంత అవసరమనేదాని గురించీ అవగాహన కల్పించేందుకోసం ఓ డాక్యమెంటరీ చేయాలనుకున్నారట. ఇందుకోసం కస్తూరిని సంప్రదిస్తే ఆమె అందుకు అంగీకరించింది.
అయితే, అనూహ్యంగా ఆ ఫొటోలు, అధికారికంగా ప్రచురితం కాకుండానే లీక్ అయ్యాయట. అలా తనకు చెడ్డ పేరు వచ్చిందని కస్తూరి వాపోతుంటుంది. నిజానికి, ఈ తరహా ప్రయోగం అంతకు ముందు కొందరు చేసినా, కస్తూరి విషయంలోనే అనూహ్యమైన రీతిలో రచ్చ జరిగింది.
ఎడిటింగ్‌లో న్యూడిటీని తగ్గించాలని నిర్వాహకులు అనుకోగా, ఫొటోలు లీక్ అయి.. మొత్తం విషయాన్నే బూతుగా మార్చేసింది.