Radhe Shyam : “రాధే శ్యామ్” సెట్ చేసిన ట్రెండ్ లో “కేజీఎఫ్ చాప్టర్ 2” కూడా..!

Radhe Shyam : ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర భారీ పాన్ ఇండియా రిలీజ్ గా వచ్చిన చిత్రాల్లో మొదటిది అందులోని కాస్త చెప్పుకోదగే చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దసరాకుడ్ రాధా కృష్ణ తెరకెక్కించాడు.
అయితే పూర్తిగా ప్రేమ కథగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చిత్ర బృందం కాస్త కొత్తగానే గానే ఆడియెన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేశారు. అలా ఈ సినిమాతో అసలు ఈ ప్రపంచంలోనే ఏ సినిమా కూడా సెట్ చెయ్యని ట్రెండ్ లో ఒక ‘మెటావర్స్’ ని తయారు చేసి తమ సినిమాని ఒక కొత్త రకంగా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లారు.
మరి ఇపుడు వీరు సెట్ చేసిన ఈ ట్రెండ్ ని మరో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా కూడా మెటావర్స్ లో ఏదో ప్రమోషన్ ని ప్లాన్ చేస్తున్నారట.
మొత్తానికి అయితే ప్లాప్ అయ్యిన రాధే శ్యామ్ ట్రెండ్ ఈ సినిమాకి పనికొచ్చింది అని చెప్పాలి. మరి ఈ సినిమాపై అయితే రికార్డు స్థాయి అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాల్సిందే. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.