“RRR” ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ సమాచారం మీకోసం.!

Interesting Information On Rrr Movie Trailer | Telugu Rajyam

పాన్ ఇండియన్ వైడ్ వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ మూవీస్ లో పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన భారీ సినిమా “ట్రిపుల్ ఆర్(RRR)” కూడా ఒకటి. ఒకో అప్డేట్ తో మంచి హైప్ ను తీసుకొస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చే బిగ్గెస్ట్ అప్డేట్ ట్రైలర్ మాత్రమే. మరి ఈ ట్రైలర్ ని వచ్చే డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేయబోతున్నట్టు రాజమౌళి మొన్ననే రివీల్ చేసాడు.

ఇప్పుడు దీనిపై ఇంకో ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది. ఈ ట్రైలర్ కూడా ఆల్రెడీ రెడీ అయ్యిందట. ఫైనల్ అవుట్ ఫుట్ కూడా చాలా బాగా వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మొత్తం 180 సెకండ్ల నిడివి వచ్చినట్టుగా రాజమౌళి అద్భుతమైన విజువల్స్ తో కట్ చేశారట. అంటే ఒక మూడు నిమిషాల పాటు ఈ భారీ సినిమా ట్రీట్ ఉంటుందన్నమాట. ఇక ఈ రిలీజ్ డేట్ కోసమే అంతా వెయిట్ చెయ్యాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles