మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. కొరటాల శివ దర్శకత్వం కావడం, రామ్ చరణ్ కీలక పాత్ర చేస్తుండటంతో చిత్రం మీద భారీ హోప్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు. మొదటి నుండి వినిపిస్తున్న కథనాల మేరకు ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖలో కీలక అధికారిగా కనిపిస్తారని రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో చేస్తున్నాడని, ఇద్దరూ కలిసి ధర్మస్థలి అనే ఊరి కోసం శత్రువులతో పోరాడతారని అంతా అనుకుంటూ వచ్చారు. అయితే యాక్త్యువల్ కథ ఇది కాదని తెలుస్తోంది. రామ్ చరణ్, చిరంజీవి పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని అంటున్నారు.
కథలో నక్సలైట్ రామ్ చరణ్ కాదని, చిరంజీవే నక్సలైట్ అంటున్నారు. చరణ్ కోసమే చిరు అడవుల నుండి ఊళ్ళోకి వస్తాడని, చరణ్ మొదలుపెట్టిన పోరాటాన్ని చిరంజీవి భుజానికెత్తుకుని పోరాడుతారని చెబుతున్నారు. దీంతో కథ మరింత ఆసక్తికరంగా అనిపిస్తోంది.ఇద్దరి పాత్రలు కలుసుకునే సన్నివేశాలు, వారి మధ్య ఎమోషనల్ సీన్స్ గొప్పగా ఉంటాయని అంటున్నాయి చిత్ర సన్నిహిత వర్గాలు. సో.. ఆచార్య కథ అంతా అనుకుంటున్నట్టు అంత సాదాసీదాగా, రెగ్యులర్ గా అయితే ఉందన్నమాట. ఇకపోతే ప్రస్తుతం ఆఖరి దశ షూటింగ్లో ఉన్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనేది ఇంకా ఫైనల్ చేయలేదు టీమ్.