స్టార్ డైరెక్టర్ రాజమౌళి అలాంటి పిచ్చి ప్రయోగాలు చేశారా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమానే ప్రాణంగా భావించి సినిమాలను తెరకెక్కించి విజయాలను అందుకుంటున్న దర్శకధీరుడు ఎవరనే ప్రశ్నకు రాజమౌళి పేరు సమాధానంగా వినిపిస్తుంది. అతి చిన్న జీవి అయిన ఈగ ప్రధాన పాత్రలో రాజమౌళి ఈగ అనే సినిమాను తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈగ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. తను అనుకున్న విధంగా సీన్ వచ్చేవరకు రాజమౌళి అస్సలు రాజీ పడరనే సంగతి తెలిసిందే. జక్కన్న తెరకెక్కించిన ప్రతి సినిమా ఏదో ఒక రికార్డ్ ను బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఅర్ రాజమౌళి ఈగ సినిమా కొరకు ఎలాంటి ప్రయోగాలను చేశారో వెల్లడించారు.

ఈగ సినిమా షూటింగ్ సమయంలో జక్కన్న కొన్ని ఈగలను ఫ్రిజ్ లో ఉంచేవారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈగల సుప్తావస్థ గురించి తెలుసుకోవడానికి రాజమౌళి ఈ తరహా ప్రయోగాలు చేశారని సమాచారం. గడ్డకట్టే ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఈగ మనుగడ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి జక్కన్న ఈ తరహా ప్రయోగాలను చేశారు. రాజమౌళి తన బృందంతో కూడా ఈగలకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించేవారని సమాచారం.

అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు రాజమౌళి అలాంటి పిచ్చి ప్రయోగాలను కూడా చేశారా అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్స్, సైమా అవార్డ్స్ తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. రాజామౌళి ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించగా రాబోయే రోజుల్లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చే సినిమాలు నభూతో నభవిష్యత్ అనే విధంగా ఉంటాయని నెటిజన్లు భావిస్తున్నారు.