ఆ నటుడిని రోడ్డుపై నిజంగా చితకబాదిన హీరో రాజశేఖర్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మేన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో రాజశేఖర్ ఒకరనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా రెండు దశాబ్దాల క్రితం వరుస విజయాలతో రాజశేఖర్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. అప్పటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన హీరో రాజశేఖర్ కావడం గమనార్హం. రాజశేఖర్ నటించిన కొన్ని సినిమాలు రికార్డులు క్రియేట్ చేశాయి.

కోడి రామకృష్ణ పోలీసులపై గౌరవం పెంచేలా సినిమా తీయాలని భావించి అంకుశం సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ సినిమా కోసం ఎంతోమందిని పరిశీలించి చివరకు కొత్త వ్యక్తి అయిన రామిరెడ్డిని ఎంతో కష్టపడి ఒప్పించారు. మొదట అంకుశంలో నటించడానికి అంగీకరించని రామిరెడ్డి కోడి రామకృష్ణ నచ్చజెప్పడంతో నటించడానికి అంగీకరించారు.

కోడి రామకృష్ణ ఛార్మినార్ దగ్గర రామిరెడ్డిని రాజశేఖర్ కొట్టే సీన్ ను షూట్ చేశారు. ఈ సీన్ సమయంలో రాజశేఖర్ రామిరెడ్డిని నిజంగానే చితకబాదారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. పోలీసులపై గౌరవం పెంచేలా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజశేఖర్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో రాజశేఖర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతోనే యాంగ్రీ యంగ్ మేన్ గా రాజశేఖర్ కు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత రామిరెడ్డికి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. కొంతమంది పోలీసులలో మార్పు రావడానికి ఈ సినిమా కారణమైంది. ఇతర భాషల్లో డబ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్లను సాధించింది. హిందీలో చిరంజీవి హీరోగా ఈ సినిమా రీమేక్ అయింది.