ఆ పని చేసి మెగాస్టార్ చిరంజీవికి షాకిచ్చిన మోహన్ బాబు.. ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకు ఎప్పుడు సక్సెస్ దక్కుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం డిజాస్టర్లుగా నిలిస్తే పరిమిత్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను అందుకుంటూ ఉంటాయి. మోహన్ బాబు సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో పెదరాయుడు సినిమా కూడా ఒకటి. తమిళంలో హిట్టైన ఒక సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలోని చిన్న రోల్ లో రజనీకాంత్ నటించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పెదరాయుడు సినిమాకు ముందు మోహన్ బాబు నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. అప్పట్లో రవిరాజా పినిశెట్టి పెదరాయుడు సినిమాకు దర్శకునిగా ఎంపికయ్యారు. మోహన్ బాబు సొంత బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించడం గమనార్హం.

రజనీకాంత్ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. మోహన్ బాబు తన నటనతో ఈ సినిమా సక్సెస్ లో కీలకంగా వ్యవహరించారు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగ్స్ ను అందుకుంది. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ప్రతి నటుడు సినిమాలోని పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తమిళంలో ఈ సినిమా డబ్ అయ్యి అక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ సాధించింది. చిరంజీవి నటించిన బిగ్ బాస్ ఈ సినిమాకు పోటీగా విడుదల కాగా బిగ్ బాస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఫుల్ రన్ లో పెదరాయుడు ఏకంగా 12 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం గమనార్హం.